'ఫర్జీ సీజన్ 2' లో హీరోయిన్ గా యుక్తి... మరి రాశీ ఖన్నా పరిస్థితేంటి..?

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాశీ కన్నా కూడా ఇందులో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2026-10-04 05:07 GMT

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ప్రస్తుతం సక్సెస్ లను సాధించడానికి నానాతంటాలు పడుతున్నారు. కొందరు హీరోలు మాత్రం సక్సెస్ లు వచ్చిన రాకపోయినా వాళ్ళు మాత్రం ఒక క్యారెక్టర్ కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. 'కబీర్ సింగ్' లాంటి మూవీ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన షాహిద్ కపూర్ ఆ తర్వాత చేసిన 'తేరి బాతోం మే ఐసా ఉల్గా జియా' కమర్షియల్ గా హిట్ అయింది. 'బ్లడీ డాడీ' ఓటీటీ లో సందడి చేసింది.. ఇక హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా షాహిద్ కపూర్ ఒక పాత్ర కోసం ఏం చేయడానికైన వెనకాడటం లేదు. ఇంతకు ముందు చేసిన 'ఫర్జీ' సిరీస్ ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు దానికి సీజన్ 2 కూడా రెడీ అవుతుంది... రాజు నిడుమోరు అండ్ కృష్ణ డి కె డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులందరిని అలరించింది. ఇక మొదటి సీజన్లో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. గత కొన్ని రోజులుగా రాశీ కన్నా ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా తొందర్లోనే ఫర్జీ సీజన్ 2 షూటింగ్ చేయబోతున్న అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాశీ ఖన్నా ప్లేస్ లో హీరోయిన్ గా 'యుక్తి థరేజా' ను తీసుకున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

నిజానికి యుక్తి థరేజా ఈ సినిమాకి చాలా బాగా సెట్ అవుతుందని వాళ్ళు భావించారట. ఏది ఏమైనా కూడా యుక్తి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది... రాశి కన్నా స్థానంలోనే యుక్తి ని హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సన్నీ పాత్రలో తిరిగి వస్తున్న షాహిద్ కపూర్ కు యుక్తి జంటగా నటించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి... ఈ సీజన్లో యుక్తి కి చాలా మంచి పాత్రను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సమాజంలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతూ అధికారులను ప్రశ్నించే జన్ జీ పాత్రలో తను మనకు కనిపించబోతుంది...

ఫర్జీ 2 లో రాశి ఖన్నా పరిస్థితేంటి

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాశీ కన్నా కూడా ఇందులో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. యుక్తి థరేజా ను మెయిన్ లీడ్ లో పెట్టి ఆమె ప్రాముఖ్యతను ఎక్కువగా పెంచుతూ రాసి కన్నా క్యారెక్టర్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది... యుక్తి థరేజా కి కూడా ఈ ప్రాజెక్టు చాలా హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ పాత్ర ఆమె కెరియర్ ని మార్చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. యుక్తి నిజంగానే ఈ సిరీస్ లో నటిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వస్తున్న కథనాలన్నీ సోషల్ మీడియాలో వస్తున్నవే తప్ప హీరోయిన్స్ విషయంలో సినిమా యూనిట్ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే యుక్తి థరేజా గతంలో కిరణ్ అబ్బవరం తో 'కే రాంప్', మలయాళం లో సూపర్ హిట్ అయిన 'మార్కో' సినిమాలో హీరోయిన్ గా నటించింది...

Tags:    

Similar News