రాజమౌళి స్టార్ డైరెక్టర్ అవ్వడానికి ఆ ఒక్క ఎమోషనల్ సంఘటనే కారణమా...
దాంతో ఫ్యామిలీ ని పోషించడానికి విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అప్పుడే కీరవాణి సైతం మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పని చేసేవాడట.
తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన దర్శకులలో రాజమౌళి ఒకరు. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శకుడు కూడా రాజమౌళి నే కావడం విశేషం... ఇప్పుడు మహేష్ బాబు తో 'వారణాసి' అనే భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు... రాజమౌళి ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. తను ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. తను ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తన మైండ్ లో ఏదైతే ఉందో దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. దానికోసం ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పడం విశేషం... రాజమౌళి డైరెక్టర్ గా మారడానికి గల కారణం ఏంటంటే ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి చాలా ఎక్కువ ఆస్తులు ఉండేవట. కానీ కాలక్రమేణ ఆ ఆస్తులు అన్ని పోయి కేవలం మనుషులు మాత్రమే మిగిలారట. రాజమౌళి కీరవాణి వీళ్ళదంత ఉమ్మడి కుటుంబం కావడంతో ఒకే రూమ్ లో 18 మంది ఉండేవారట.
దాంతో ఫ్యామిలీ ని పోషించడానికి విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అప్పుడే కీరవాణి సైతం మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పని చేసేవాడట. అలా వచ్చిన డబ్బులతో ఫ్యామిలీ మొత్తాన్ని పోషిస్తూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఆ పరిస్థితులను చూసుకుంటూ వచ్చాడు కాబట్టి తను కూడా ఫ్యూచర్లో ఏదో ఒకటి గొప్పగా సాధించాలని అనుకున్నాడట. అందులో భాగంగానే ఆయన కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాడు.
అక్కడ ఎడిటింగ్ కి సంబంధించిన మెలకువలు నేర్చుకున్న తర్వాత రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే రాజమౌళి వాళ్ళ నాన్న అయిన విజయేంద్రప్రసాద్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా కూడా వ్యవహరించేవారట. ఇలా సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్ ల గురించి అవగాహన వచ్చినప్పటికి తను డైరెక్షన్ చేయాలా వద్దా అనే విషయంలో రాజమౌళి మాత్రం డైలామాలో ఉండేవాడట. ఇక అదే సమయంలో విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో 'అర్ధాంగి' అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా కేవలం ఒక్కరోజు మాత్రమే ఆడడంతో విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా పనికిరాడు అంటూ చాలామంది అతన్ని విమర్శించారట. దాంతో రాజమౌళి వాళ్ళ నాన్నకి జరిగిన అవమానాన్ని తనకి జరిగినట్టుగా భావించి దర్శకుడి గా మారాలని అనుకున్నాడట. ఆ రకంగా రాజమౌళి డైరెక్షన్ వైపు అడుగులు వేశాడు. ఆ రోజు వాళ్ళ నాన్నకి జరిగిన అవమానమే ఈరోజు రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదగడానికి ఒక కారణమైంది... ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వచ్చే సినిమా కోసం ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్నారంటే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు...