'జనవరి 12 విడుదల' మూవీ లో ఆ స్టార్ డైరెక్టర్ కీలక పాత్రలో నటిస్తున్నాడా...

అనుదీప్ దర్శకుడిగానే కాకుండా పబ్లిక్ ఈవెంట్లో ఎప్పుడు కనిపించిన కూడా కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

Update: 2026-10-04 06:31 GMT

సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మేకర్స్ ఒక్క సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను పడుతున్నారు. అలాంటిది అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మాత్రం వరుసగా తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు తను చేస్తున్న పదోవ సినిమాని కూడా విజయవంతంగా నిలుపడానికి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. ప్రస్తుతం 'జనవరి 12 విడుదల' అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ - కళ్యాణ్ రామ్ ఇద్దరు హీరోలుగా నటిస్తుండటం విశేషం... అనిల్ రావిపూడి కి వెంకటేష్ కి మధ్యనున్న బాండింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి.

ఆ నాలుగు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్టార్ డైరెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే 'జాతి రత్నాలు' సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక పాపులారిటిని క్రియేట్ చేసుకున్న కెవి అనుదీప్ కావడం విశేషం...ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట...

అనుదీప్ దర్శకుడిగానే కాకుండా పబ్లిక్ ఈవెంట్లో ఎప్పుడు కనిపించిన కూడా కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అందువల్లే అనుదీప్ ను చాలా మంది డైరెక్టర్లు తమ సినిమాల్లో భాగం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇక అనిల్ రావిపూడి 'జనవరి 12 విడుదల' సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసారట. దానికి అనుదీప్ అయితే బాగుంటాడని అనిల్ అనుకోని అనుదీప్ ను కలిసి అతనికి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పాడట. అది విన్న వెంటనే తను ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో కలిసి అనుదీప్ చేయబోయే కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అనిల్ రావిపూడి ఈసారి డిఫరెంట్ కామెడీని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వన్ లైనర్ పంచ్ లను ఈ సినిమా కోసం ఎక్కువగా వాడట. రాబోయే సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేస్తు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంలో అనిల్ రావిపూడి ఉన్నాడు. మరి ఈ సినిమా అనిల్ రావిపూడి కి మరో సక్సెస్ ను కట్టబెట్టి తనకి పదో విజయాన్ని అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...

Tags:    

Similar News