రిలేషన్ టాక్ మధ్య బిగ్ స్టేట్‌మెంట్.. " నా సెకండ్ హోమ్ అదే" అంటున్న భాగ్యశ్రీ

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.

Update: 2026-06-21 11:22 GMT

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఒకవైపు రామ్ పోతినేనితో ఈమె రిలేషన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తున్న వేళ.. ఈ ముద్దుగుమ్మ తాజాగా హైదరాబాద్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న భాగ్యశ్రీ, హైదరాబాద్ తన పాలిట ఎలాంటిదో ఓపెన్‌గా చెప్పేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

యాంకర్ సుమ షోలో భాగ్యశ్రీ ముచ్చట్లు:

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సరికొత్త రూరల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'లెనిన్'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేసిన ఒక ప్రత్యేక ప్రోగ్రామ్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా సుమ అడిగిన ఒక ప్రశ్నకు భాగ్యశ్రీ బోర్సే సమాధానమిస్తూ.. "నా ఫస్ట్ హోమ్ ఔరంగాబాద్. కానీ నా సెకండ్ హోమ్ మాత్రం హైదరాబాదే. అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది" అంటూ చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు.

సుమ కంగ్రాట్స్.. అఖిల్ నవ్వులు:

భాగ్యశ్రీ నోట హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అనే మాట వినగానే యాంకర్ సుమ తనదైన స్టైల్లో స్పందించారు. "కంగ్రాట్స్ భాగ్యశ్రీ.. వెల్‌కమ్ టు హైదరాబాద్. ఇప్పటికే ఇండియా నలుమూలల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకుని సెటిలవుతున్నారు. ఇక మీరు కూడా అలాగే ఇక్కడే పక్కాగా సెటిలైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని చెప్పారు. సుమ అలా అనడంతో పక్కనే ఉన్న హీరో అఖిల్ అక్కినేని ముసిముసి నవ్వులు చిందించడం విశేషం.

జులై 10న ‘లెనిన్’ గ్రాండ్ రిలీజ్:

మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఎస్. థమన్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ హిట్ అయ్యాయి. సినిమా అవుట్‌పుట్ చాలా పవర్‌ఫుల్‌గా వచ్చిందని, జులై 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఒకవైపు రామ్‌తో లింక్ పెడుతూ వస్తున్న గాసిప్స్ నడుస్తున్న టైమ్‌లోనే.. భాగ్యశ్రీ ఇలా హైదరాబాద్‌ను నా సెకండ్ హోమ్ అని ఓన్ చేసుకోవడం టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. అంటే ఈ భామ లాంగ్ రన్ ఇక్కడే ఉండిపోవడానికి గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇక మరి జులై 10న రాబోతున్న అఖిల్ 'లెనిన్' సినిమా భాగ్యశ్రీ కెరీర్‌కు ఇక్కడ ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి..

Tags:    

Similar News