పోసాని చెప్పేవన్నే నిజాలేనా? లేక...

Update: 2017-07-16 04:49 GMT
మధుర్ బండార్కర్ తీసిన ''హీరోయిన్'' సినిమాలో ఒక డైలాగ్ ఉంది.. 'కాన్ఫిడెన్స్ తో చెబితే అబద్దాన్ని కూడా నిజం అని నమ్ముతుంది ఫిలిం ఇండస్ర్టీ మరియు మీడియా' అంటూ ఒక డైలాగ్ బాగా హిట్టయ్యింది. కాని కొంతమంది విషయాల్లో చూస్తే.. వీళ్ళు నిజంగానే నిజం చెబుతున్నారో లేకపోతే ఇలా కాన్ఫిడెన్స్ తో ఏదో ఒకటి చెప్పేసి అది నిజం అనే కలరింగ్ ఇచ్చే పనిలో ఉన్నారా అనే సందేహం వస్తోంది.

అస్తమానం తానో అబద్దం చెప్పని హరిశ్చంద్రుడి తరహాలో చాలా విషయాలను చెబుతుంటాడు పోసాని కృష్ణమురళి. మొన్నటికి మొన్న నటుడు భరత్ చనిపోయినప్పుడు.. ఎవరు ఏమనుకున్నా కూడా అతను చాలా హానెస్ట్ అని.. అందుకే అతనంటే తనకు ఇష్టమని చెప్పాడు. ఇప్పుడేమో తనకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదని.. అవన్నీ కేవలం హంబక్కేనని చెబుతున్నాడు. ఇదంతా కానట్టు.. టివిల్లో రియల్ లైఫ్‌ దంపతుల గొడవలను సెటిల్ చేసే రియాల్టీ షోలన్నీ కూడా చాలా వరకు అబద్దం అంటూ చెప్పేస్తున్నాడు. జనాలు ఏదన్నా మంచి గురించి చెబితే వెంటనే నమ్మరేమో కాని.. ఇలా దేన్నైనా నెగెటివ్ గా చెబితే మాత్రం వెంటనే నమ్మేస్తారు. ఒకరకంగా దంపతుల గొడవలను సెటిల్ చేసే ఆ ప్రోగ్రామ్ లను చూస్తే.. చాలావరకు వాస్తవంగా గొడవులన్న కపుల్సే కనిపిస్తున్నారు. మరి పోసాని ఇలా వారందరూ డూప్లికేట్ కపుల్స్ అని.. డబ్బులిచ్చి తెచ్చారని కామెంట్లు చేయడం ఎంతవరకు సబబు?

అసలు ప్రతీ విషయంపై పోసాని ఇలా నిజం చెబుతున్నా నిజం చెబుతన్నానను అంటూ చాలా చెప్పేస్తున్నాడు కాని.. అవన్నీ నిజాలేనే లేక కాన్ఫిండెంటుగా చెప్పేసి నిజాలని నమ్మిస్తున్నాడా? అనే సందేహం చాలామందికి వచ్చేస్తోంది. అది సంగతి.
Tags:    

Similar News