పూర్వ వైభవం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న ప్రముఖ ఛానల్..?
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన 'స్టార్ మా' కరోనా లాక్ డౌన్ సమయంలో మంచి రేటింగ్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ కి దూరమైన జనాలకు 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో కొన్నాళ్ళు అలరించింది స్టార్ మా. టెలివిజన్ రంగంలో సూపర్ సక్సెస్ అయిన 'బిగ్ బాస్' ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్ కూడా మంచి రేటింగ్స్ తెచ్చుకుంది. అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత స్టార్ మా ఛానల్స్ రేటింగ్స్ పెరగడం లేదు. స్టార్ మా వారికి ప్రైమ్ టైమ్ లో వచ్చే 'కార్తీక దీపం' సీరియల్ కి కూడా గత మూడు నెలలుగా సరైన రేటింగ్స్ రావడం లేదని తెలుస్తోంది.
అయితే లాక్ డౌన్ టైమ్ లో వచ్చిన మంచి రేటింగ్స్ కారణంగా 'స్టార్ మా' వారు వరుసగా కొన్ని రియాల్టీ షోలు ఓకే చేసేయడం.. ఇప్పుడు వాటికి సరైన ఓపెనింగ్స్ రాకపోవంతో ప్రమోట్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు సినిమా వాళ్లు కూడా ఈ ఛానల్ ని లైట్ తీసుకొని అంతా ఈటీవీ - జీతెలుగు వైపు వెళ్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా మళ్లీ తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి 'స్టార్ మా' వారు తెగ ట్రై చేస్తున్నారని మీడియా సర్కిల్స్ లో అనుకుంటున్నారు.