• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెంటిమెంట్ నే నమ్ముకున్న...

సెంటిమెంట్ నే నమ్ముకున్న పూనమ్

By - Tupaki Desk
Update: 2016-01-25 04:18 GMT
పూనమ్ భజ్వా టాలీవుడ్ కు పరిచయమై దశాబ్దకాలమైంది. ఆమె తరువాత టాలీవుడ్ కు పరిచయమైన చాలా మంది తారలు స్టార్ హీరోయిన్లు అయిపోయారు. చూడటానికి బొద్దుగా వుండే పూనమ్... పుట్టింది వైజాగ్ లోనైనా.. పెరిగింది మాత్రం పూణెలో. ఆమె తండ్రి నేవీ అధికారి కావడంతో కొంతకాలం వైజాగ్ లో పనిచేశారు. ఇక్కడే పుట్టింది కాబట్టి.. ఆమెకు తెలుగు గడ్డతో పరిచయమే వుంది. అయితే టాలీవుడ్ కి మాత్రం ఉత్తరాధి భామగానే పరిచయమైంది. 2005లో ‘మొదటి సినిమా’తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత ఏదో చిన్న చిన్న సినిమాల్లోనైతే నటించింది కానీ... స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం రాలేదు. చివరకు ‘పరుగు’ సినిమాలో షీలా సిస్టర్ పాత్రలో నటించింది. దాంతో ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసే ఛాన్సులు మాత్రం రాలేదు. ఇక చేసేది లేక కోలీవుడ్ - మాలీవుడ్ - శాండిల్ వుడ్ లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ ఈ అమ్మడికి బాగానే కలిసొచ్చింది.

అందులో భాగంగానే ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో సిద్ధార్థ్ తో కలిసి ‘అరణ్మయి2’లో నటించింది. ఇందులో హన్సిక - త్రిష కూడా నటించారు. ఈ చిత్రం ఈనెల 29 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్లో ‘కళావతి’ పేరుతో విడుదల చేస్తున్నారు. గతంలో తమిళ చిత్రం ‘రోమియో జూలియట్’లో హన్సికతో కలిసి సిల్వర్ స్క్రీన్ ను పంచుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టయింది. ఇప్పుడు కూడా అరణ్మయి2లో హన్సికతో కలిసి నటించింది. అదే సెంటిమెంట్ ఇప్పుడు రిపీట్ అవుతుందని చెబుతోంది పూనమ్. మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పూనమ్ మాట్లాడుతూ ‘ఇందులో నేను కేరళకు చెందిన రాధ అనే నర్సు పాత్రలో నటించా. కథలో నాది ఇంపార్టెంట్ రోల్. దర్శకుడు సుందర్ సి. నా పాత్రను ఎంతో బాగా తీర్చిదిద్దారు. ఇందులో నా పాత్ర దాదాపు 35 నిమిషాల పాటు వుండొచ్చు. చాలా కీలకమైన రోల్ పోషిస్తున్నా. నేను ఇందులో ఆత్మనా, దెయ్యాన్నా అనేది మీరు సినిమాలో చూడాల్సిందే. గతంలో నేను, హన్సిక కలిసి ‘రోమియో జూలియట్’ లో జయం రవితో కలిసి నటించాం. అది కోలీవుడ్ లో ఎంత పెద్ద హిట్టయిందో అందికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సినిమా అంతే పెద్ద హిట్టవుతుందనే సెంటిమెంట్ నాకుందని’ తెలిపింది. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి పూనమ్ కు మరిన్ని అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.
Tags:    
  • Poonam Bajwa 
  • Kalavathi Movie 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS