పూజా Vs కియ‌రా.. LFW షోలో క‌ళ్లు చెదిరే ట్రీట్

Update: 2021-03-22 06:30 GMT
ఫ్యాష‌నిస్టాల అంద‌చందాల ఎలివేష‌న్ తో లాక్మే ఫ్యాష‌న్ వీక్ (LFW) వేడెక్కుతోంది. ముంబైలో జరుగుతున్న లైవ్ ఈవెంట్ లో ఈ రోజు షోబిజ్ ‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇద్దరు నటీమణుల హ‌వా సాగింది. పూజా హెగ్డే Vs కియ‌రా! దుమారం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ర్యాంపుపై ఆ ఇరువురు భామ‌ల‌ త‌ళుకుబెళుకులు ప్ర‌ధానంగా హైలైట్. నటీమణులిద్దరూ షోస్టాపర్లుగా నిలిచారు.

మనీష్ మల్హోత్రా స‌హా హైద‌రాబాదీ రూపొందించిన డిజైన‌ర్ దుస్తుల్లో అందాల్ని ఆర‌బోసారు స‌ద‌రు భామ‌లు. ఇక ఈ పోటీలో పూజాతో పోలిస్తే కియ‌రా మ‌రింత‌గా రెచ్చిపోయి అందాల్ని ఆవిష్క‌రించింది. కియారా అద్వానీ మ‌నీష్ ధ‌రించిన దుస్తులతో ర్యాంప్ పై ఫోజులివ్వ‌గా.. బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే హైదరాబాద్ డిజైనర్ వరుణ్ చక్కిలం డిజైన్స్ ధ‌రించి అందాలు ఒలికించారు. స‌ద‌రు భామ‌ల అంద‌చందాలు ర్యాంప్ ప‌రిస‌రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

లక్మే ఫ్యాషన్ వీక్ భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్ షో. ప్ర‌తిసారీ బాలీవుడ్ నుండి కొంద‌రు అంద‌గ‌త్తెలు ఈ వేదిక‌పై త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తమదైన రీతిలో ఫ్యాషన్ ను సృజించారు. కొత్త తరం అందాల భామ‌ల్లో కియారా.. పూజ ఇద్దరూ స్టైల్ ఐకాన్స్ గా నిరూపించుకున్న సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News