వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది పూజా హెగ్డే. తెలుగు-తమిళం-హిందీలో వరుస సినిమాలతో బిజీ అయ్యింది. మరోవైపు పూజా నటించిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. ఈలోగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన `భవదీయుడు భగత్ సింగ్` చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. డీజే- గద్దల కొండ గణేష్ చిత్రాల్లో అవకాశం కల్పించిన హరీష్ శంకర్ ఇప్పుడు పూజాకి మరో ఆఫర్ ఇచ్చారు.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయిందని హరీష్ ప్రకటించారు. 13 అక్టోబర్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా మరోసారి ఈ విషయాన్ని హరీష్ ఖాయం చేశారు. డీజే- గద్దలకొండ గణేష్ సినిమా వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేస్తూ పూజా ఏ రోల్ కి అయినా సరిపోతుంది అని విషెష్ తెలిపారు.
దానికి పూజా కూడా అంతే ఎగ్జయిట్ అయిపోయింది. పవర్ స్టార్ సరసన తనను ఎలా చూపిస్తారోనన్న ఎగ్జయిట్ మెంట్ తనలో కనిపించింది. టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసనా నటించేసిన పూజా.. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సరసన అవకాశం అందుకోవడంతో కాస్త టెన్షన్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ టెన్షన్ తగ్గాలంటే తన పాత్ర ఎలా ఉంటుందో హరీష్ వెల్లడించాల్సి ఉంటుంది. అటు కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ సరసన పూజా బీస్ట్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.