సినిమాకు ఓకే చేశాక.. ఇంత హోంవర్కు చేస్తుందట!

Update: 2021-10-17 06:34 GMT
ఒక సినిమాకు ఓకే చెప్పటం.. జస్ట్ లైక్ దట్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. సినిమా లాంటి గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలే తక్కువగా వస్తుంటాయి. అలాంటిది.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ మన వెంట ఉంటుంది. అన్నింటికి మించి కోట్ల్లల్లో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే 'స్టార్' ఇమేజ్ తెచ్చుకోవటం ఎంత కష్టమో.. దాన్ని కొనసాగించటం అంతకు రెట్టింపు కష్టం. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరున్న బ్యూటీ పూజా హెగ్డే. వరుస పెట్టి సినిమాలు చేయటం ఒక ఎత్తు అయితే.. అవన్నీ విజయవంతం కావటం.. అందులో ఆమెకు మంచి పేరు తెచ్చుకోవటం అంత మామూలు విషయం కాదు.

తెలుగు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది తెలిసిందే. అలాంటి ఇండస్ట్రీలో తన మార్కు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కోసం హీరోయిన్లు కొందరు ఎంతలా కష్టపడతారో తెలిస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో  బుట్టబొమ్మ బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఒక సినిమాను ఓకే చేసిన తర్వాత తాను కొంత హోంవర్కు చేస్తానని.. తన పాత్రను మరింత ఇంప్రూవ్ చేసుకుంటానని.. తనదైన శైలిలో కొన్నింటిని యాడ్ చేస్తానని చెప్పుకొచ్చింది.

తాజాగా తాను చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ విషయానికి వస్తే.. అందులో స్టాండప్ కమెడియన్ పాత్రను చేసింది. ఇందుకోసం కొంతమంది స్టాండప్ కమెడియన్స్ ను కలవటమే కాదు.. వారు మైక్ ఎలా పట్టుకుంటారు? ఎలా ఉంటారు? లాంటి అంశాల్ని నేర్చుకుందట. అంతేకాదు.. సినిమాలో తాను నటించే పాత్ర గురించి దర్శకుడితో చర్చించి నోట్స్ రాసుకోవటేమ కాదు.. తనకొచ్చిన ఐడియాల్ని షేర్ చేసుకొని.. కొంత మార్చుకుంటానని చెప్పింది.

హీరోయిన్ రోల్ కు బ్యాక్ స్టోరీ ఏమీ లేదని దర్శకుడు చెబితే.. తానే సొంతంగా క్రియేట్ చేసుకుంటానని చెప్పటం గమానార్హం. ఇందుకు ఉదాహరణగా ఒక ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. ''అరవింద సమేత వీరరాఘవ' చూస్తే... అరవింద పాటలెక్కువ వింటుంది. త్రివిక్రమ్‌గారితో హీరోయిన్‌ క్యారెక్టర్‌ గురించి మాట్లాడినప్పుడు... 'ఆ అమ్మాయి మ్యూజిక్‌ లవర్‌గా ఉండొచ్చా?' అని అడిగా. ఆయన ఓకే అన్నారు. ఎంతమంది గమనించారో తెలియదు కానీ... ఆ సినిమాలో నా చేతి మీద మ్యూజిక్‌ నోట్‌ టాటూ ఉంటుంది. నా కోసం, నా పాత్ర సరదాగా ఉంటడం కోసం అటువంటి చిన్న చిన్నవి చేస్తుంటా'' అని చెప్పింది. ఇంతలా హోంవర్కు చేస్తుంది కాబట్టే.. వరుస విజయాల్ని సొంతం చేసుకుంటుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News