బాపు బొమ్మగా ప్రమోటైన బుట్ట బొమ్మ
అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించింది పూజా హెగ్డే. కార్పొరెట్ కంపెనీ సీఈవోగా.. అల్ట్రా మోడ్రన్ బుట్టబొమ్మగా ఈ మూవీలో తనదైన నటనతో కట్టిపడేసింది పూజా. అల.. పొడుగు కాళ్ల అందానికి ముగ్ధుడయ్యే యువకుడిగా బన్ని నటించారు.
క్లాసిక్ చిత్రంలో బుట్టబొమ్మగా ప్రమోట్ చేసిన త్రివిక్రమ్ మరోసారి అల సీక్వెల్లోనూ పూజాకి అవకాశం ఇవ్వనున్నారన్న ప్రచారం ఉంది. అదంతా సరే కానీ...పూజా లేటెస్ట్ ఫోటోషూట్ లో అచ్చ తెలుగు అమ్మాయిలా.. అందాల బాపు బొమ్మనే తలపిస్తోంది. ఎంతో సింపుల్ గా పంజాబీ దుస్తుల్లో కనిపించింది.
వంగపువ్వు రంగు డిజైనర్ డ్రెస్ పూజా అందాన్ని ముగ్ధమనోహరంగా ఆవిష్కరించింది. బుట్ట బొమ్మ కాస్తా బాపు బొమ్మగా ప్రమోటైందా? అంటూ అభిమానులు ఈ ఫోటోపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన `రాధేశ్యామ్` లో నటించింది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కి రానుంది. అలాగే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాలకు కమిటైంది.