మాస్ అవ‌తార్‌తో బోయ‌పాటి సినిమా!

గ‌త ఏడాది చివ‌ర్లో విడుద‌లైన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా విడుద‌లై ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది.;

Update: 2026-03-12 11:04 GMT

టాలీవుడ్‌లో హార్డ్ కోర్ యాక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బోయ‌పాటి శ్రీ‌ను. భ‌ద్ర నుంచి నిన్న‌టి `అఖండ 2` వ‌ర‌కు ఆయ‌న చేసిన సినిమాల్నీ హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాలే. అలాంటి బోయ‌పాటి శ్రీ‌ను..యాక్ష‌న్ మూవీస్‌కి బాలీవుడ్‌లో కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన స‌న్నిడియోల్‌తో క‌లిస్తే ర‌చ్చ ర‌చ్చే..అలాంటి ర‌చ్చ‌కు తెర‌తీస్తున్నారు ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. వివారాల్లోకి వెళితే.. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో బోయ‌పాటి శ్రీ‌ను ఇటీవ‌ల `అఖండ 2`ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

గ‌త ఏడాది చివ‌ర్లో విడుద‌లైన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా విడుద‌లై ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది. ఉత్త‌రాదిలో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈ మూవీని భారీ స్థాయిలో ప్ర‌మోట్ చేసిన ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు చేరువు చేయాల‌ని చూసిన బోయ‌పాటి ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దీంతో ఎలాగైనా బాలీవుడ్ క్రేజీ స్టార్‌తో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్న‌లు మొద‌లు పెట్టారు. ర‌ణ్ వీర్ సింగ్ ని ఇందుకు ఎంచుకున్న బోయ‌పాటి ఫైన‌ల్‌గా ర‌ణ్‌వీర్‌ని క‌న్విన్స్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

అదే స్టోరీని రానాతో చేస్తాడ‌ని, దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దానికి పూర్తి భిన్నంగా బోయ‌పాటి శ్రీ‌నుతో బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్ని డియోల్‌ హీరోగా ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని తెర‌పైకి తీసుకురావాల‌ని మైత్రీ మూవీమేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో స‌న్నీడియోల్ న‌టించిన యాక్ష‌న్ డ్రామా `జాట్‌`. హిందీలో రూపొందిన ఈ సినిమాని తెలుగులోనూ మైత్రీ వారు రిలీజ్ చేశారు.

భారీ స్థాయిలో గ‌త ఏడాది ఏప్రిల్‌లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ని చేయాల‌ని మైత్రీ మూవీమేక‌ర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని బోయ‌పాటి శ్రీ‌ను, స‌న్నీడియోల్ కాంబినేష‌న్‌లో చేస్తే థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయిని, అందుకే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో `జాట్ 2`ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. స‌న్నిడియోల్ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిన్ ప్ర‌జెన్స్‌కు బోయ‌పాటి మార్కు యాక్ష‌న్ తోడైతే రికార్డుల మోతేన‌ని ట్రేడ్ వ‌ర్గాలు కూడా చెబుతుండ‌టంతో వీరిద్ద‌రి క‌ల‌యికపై అంద‌రి దృష్టిప‌డింది.

ఈ క్రేజీ కాంబినేష‌న్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. స‌న్నీ డియోల్ కూడా టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో క‌లిసి వ‌ర్క్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపిస్తుండ‌టం, ఇటీవ‌లే బోర్డ‌ర్ 2 కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో బోయ‌పాటి - స‌న్నీ కాంబోలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రావ‌డం ఇక లాంచ‌న‌మేన‌ని అంతా అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని అధికార‌కంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ప్ర‌క‌టించనున్నార‌ని తెలిసింది.

Tags:    

Similar News