వైరల్.. మహేష్ తో ప్రియాంక కపుల్ మూవీ నైట్
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మొదటి సారి ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకుంది. సెట్స్ లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ స్టార్స్ లేటెస్ట్ గా కాస్త బ్రేక్ తీసుకుని సరదాగా గడిపారు. షూటింగ్ గ్యాప్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఫ్యాన్స్ కు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు.
ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరు ఏఎంబీ సినిమాస్ లో సందడి చేశారు. తన థియేటర్ కు వచ్చిన ఈ స్పెషల్ గెస్టులకు మహేష్ స్వయంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ ముగ్గురూ కలిసి ఏఎంబీ లాంజ్ లో దిగిన ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ఈ వారణాసి స్టార్స్ ఇలా ఒకచోట కలవడానికి మెయిన్ రీజన్ హాలీవుడ్ మూవీ అని తెలుస్తోంది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ సినిమా ది ఒడిస్సీ చూసేందుకు వీరంతా ఏఎంబీకి వచ్చారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ హడావిడి నుంచి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇలా ఒక మూవీ నైట్ ప్లాన్ చేసుకున్నారు. సినిమా చూస్తూ, ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఈ స్టార్స్ కాసేపు చాలా క్యాజువల్ గా టైమ్ స్పెండ్ చేశారు.
ఇక ఈ ఫోటోలో ముగ్గురి లుక్స్ సింపుల్ అండ్ స్టైలిష్ గా ఉన్నాయి. మహేష్ బాబు బ్లాక్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ తో పాటు తలకు క్యాప్ పెట్టుకుని కూల్ గా కనిపించారు. వారణాసి కోసం పెంచిన ఆ లాంగ్ హెయిర్, గుబురు గడ్డం ఈ పిక్ లో స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ప్రియాంక చోప్రా ఒక నార్మల్ డ్రెస్ లో నాచురల్ లుక్ తో కనిపించగా, నిక్ జోనస్ కూడా వైట్ షర్ట్, బ్లాక్ షార్ట్ తో సింపుల్ గా ఉన్నారు.
ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆర్టిస్టుల మధ్య తెర బయట కూడా మంచి బాండింగ్ ఉండటం చాలా ప్లస్ అవుతుంది. వారణాసి షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ లీడ్ పెయిర్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది. సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా, ఈ క్యాజువల్ పిక్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తోంది.
షూటింగ్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రావాల్సి ఉంది. వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రియాంక మందాకిని అనే క్యారెక్టర్ లో డబుల్ షేడ్స్ చూపించనుందట. త్వరలోనే సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.