పెళ్లి పెద్దలు రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న దంప‌తులా!

ఆమెది బిజినెస్ ఫ్యామిలీ. ఇలా వేర్వేరు రంగాల‌కు చెందిన కుటుంబాలు క‌ల‌వ‌డం అంత సుల‌భం కాదు.;

Update: 2026-03-12 12:30 GMT

అల్లు శిరీష్-నైనిక‌లు వివాహ బంధంతో ధాప‌త్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రిది ప్రేమ వివాహం. వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి స‌మ‌యంలో అయిన ప‌రిచ‌యం ప్రేమ‌గా విక‌సించి పెళ్లి వ‌ర‌కూ దారి తీసింది. అయితే ఈ పెళ్లి విష‌యంలో రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు ఓ ర‌కంగా పెళ్లి పెద్ద‌లుగా వ్య‌వ‌రించిన‌ట్లు శిరీష్ మాట‌ల ద్వారా అర్ద‌మ‌వుతుంది. శిరీష్ అల్లు కుటుంబానికి చెందిన వారు కాబ‌ట్టి సెల‌బ్రిటీ ఫ్యామిలీ లోకి వ‌స్తారు. కానీ నైనిక‌కు సినిమాల‌తో ఎలాంటి సంబంధం లేదు. ఆమెది బిజినెస్ ఫ్యామిలీ. ఇలా వేర్వేరు రంగాల‌కు చెందిన కుటుంబాలు క‌ల‌వ‌డం అంత సుల‌భం కాదు.

అప్ప‌టికే ప‌రిచ‌యాలు ఉంటే ప‌ర్వాలేదు. కానీ ఎలాంటి ప‌రిచ‌యం లేకుండా పెళ్లి వ‌ర‌కూ వెళ్ల‌డం అన్న‌ది అంత సుల‌భం కాదు. అందుకే రామ్ చ‌ర‌ణ్ దంపతులు ఇరు కుటుంబాల మ‌ధ్య ఓ ఆత్మ‌య స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇరు కుటుంబాల్లో ఒక‌ర్ని ఒక‌రు అర్దం చేసుకోవ‌డానికి ఎంతో కీల‌కంగా మారింది. ఈ విందు తర్వాతే పెళ్లి పనులు వేగవంతం అయ్యాయని తెలుస్తోంది. నైనిక కుటుంబ సభ్యులకు మెగా - అల్లు కుటుంబాల జీవనశైలిని, వారి సంప్రదాయాలను పరిచయం చేయడంలో ఈ డిన్నర్ పార్టీ కీలక పాత్ర పోషించిన‌ట్లు చెప్పొచ్చు.

సాధారణంగా ఇలాంటి భారీ వివాహాల్లో ఇరు కుటుంబాల మధ్య సమన్వయం చాలా కీల‌కం. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక శిరీష్ - నైనికల కొత్త ప్రయాణానికి బలమైన పునాది వేసిందని చెప్పొచ్చు. మొత్తంగా రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ అనేది వివాహానికి ఓ ట‌ర్నింగ్ పాయింట్ లా కనిపిస్తుంది. చ‌ర‌ణ్‌-శిరీష్ మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగాను మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు వ‌రుస‌కు బావ‌-బామ్మ‌ర్దులు. కానీ చిన్న‌నాటి నుంచి స్నేహితులుగా ఉంటున్నారు.

కేవలం విందు మాత్రమే కాకుండా, పెళ్లికి ముందు జరిగిన దుబాయ్ బ్యాచిలర్ పార్టీ , హైదరాబాద్‌లోని ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో కూడా చరణ్ దంపతులు సందడి చేశారు. అయితే నైనికకు మెగా కుటుంబంలోని కొందరు సభ్యులతో (లావణ్య త్రిపాఠి ద్వారా) ముందు నుంచే పరిచయం ఉంది. అల్లు వారితో ఆమెకు బంధం కుదిరింది మాత్రం శిరీష్ ద్వారానే. మ‌రి వివాహ బంధంతోనైనా శిరీష్ మ‌ళ్లీ న‌టుడిగా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. కొంత కాలంగా శిరీష్ సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News