పిక్‌టాక్‌ : బైకర్‌ కోసం శర్వా కష్టం చూడండి

యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం 'బైకర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.;

Update: 2026-03-12 10:05 GMT

యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం 'బైకర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బైకర్‌ సినిమా కోసం శర్వానంద్‌ గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడట. అంతే కాకుండా బైకర్‌ కోసం శర్వానంద్‌ తన ఫిజిక్‌ను చాలా మార్చుకున్నాడని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు చూస్తూ ఉంటే బైకర్‌ కోసం శర్వానంద్‌ ఏ స్థాయిలో కష్టపడ్డాడో, ఎలా కనిపించబోతున్నాడో క్లారిటీ వస్తుంది. బైకర్‌ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్‌, గ్లిమ్స్ వీడియోలు అంచనాలు పెంచాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే విధంగా తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.




బైకర్‌ మూవీ రిలీజ్‌...

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందుతున్న బైకర్‌ సినిమాను ఏప్రిల్‌ 3న విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసినట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ముఖ్య పాత్రలో నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు అభిలాష్ రెడ్డి ఇద్దరు హీరోల పాత్రలను ఆకట్టుకునే విధంగా మలిచినట్లు చెబుతున్నారు. శర్వానంద్‌ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా బైకర్‌ సినిమాలో శర్వానంద్‌ పాత్ర నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్‌ కెరీర్‌ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. కమర్షియల్‌ సక్సెస్‌ లను బేరీజు వేయకుండా కథకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న విషయం తెల్సిందే.




శర్వానంద్‌ బైక్‌ రేసర్‌గా...

ఈ సినిమాలో శర్వానంద్‌ను ఒక ప్రొఫెషనల్‌ మోటార్ బైక్‌ రేసర్‌ పాత్రలో చూడబోతున్నాం. ఈ సినిమాలో మాళవిక నాయర్‌, రాజశేఖర్‌ ఇంకా ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నారు. రేసింగ్‌ సన్నివేశాలతో సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. అంతే కాకుండా సినిమా మొదటి నుంచి చివరి వరకు రేసింగ్‌తో పాటు, ఒక ఎమోషన్‌ ను కలిగి ఉంటుందని, ఆ ఎమోషన్‌కి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బైకర్‌ సినిమా ఫలితంపై చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. శర్వానంద్‌ ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా హీరోగా శర్వానంద్‌కు ఈ సినిమా ఎప్పటికీ నిలిచి పోయే సినిమా అవుతుందని, కెరీర్‌లో చాలా స్పెషల్‌ మూవీగా బైకర్‌ ఉంటుందని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.




నారి నారి నడుమ మురారి సినిమాతో...

శర్వానంద్‌ గత చిత్రం నారి నారి నడుమ మురారి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. చాలా కాలంగా ఎదురు చూస్తున్న హిట్‌ పడటంతో శర్వానంద్‌ ఫామ్‌లోకి వచ్చినట్లు అయింది. ఆయన ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో తన సత్తా చాటబోతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. నారి నారి నడుమ మురారి సినిమాకు పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్‌తో, నేపథ్యంతో రూపొందిన బైకర్‌ సినిమాతో శర్వానంద్‌ హిట్ కొడితే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఘనత ఆయనకు దక్కుతుంది అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. బైకర్‌ సినిమా స్టార్‌ కాస్ట్‌తో పాటు, దర్శకుడి నమ్మకం, నిర్మాత యొక్క నమ్మకం చూస్తూ ఉంటే ప్రేక్షకులకు పైసా వసూల్‌ మూవీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పటికే బైకర్‌ సినిమాకు ఉన్న పాజిటివ్‌ బజ్‌ ను పెంచే విధంగా శర్వానంద్‌ తాజా ఫోటోలు ఉన్నాయి. బైకర్‌ కోసం శర్వా ఎంత కష్టపడ్డాడో ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది అని ఆయన అభిమానులు అంటున్నారు.



Tags:    

Similar News