• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ ను చీఫ్ గెస్టుగా...

హీరోయిన్ ను చీఫ్ గెస్టుగా పిలవడమే ఆశ్చర్యం: పూజ హెగ్డే

By - Tupaki Desk
Update: 2021-10-24 03:57 GMT
టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరని ఎవరిని అడిగినా, ఎంతమాత్రం తడుముకోకుండా చెప్పే మాట పూజ హెగ్డే. కొంతకాలంగా విజయాలు ఆమెతో విడదీయరానంత సహవాసం చేస్తున్నాయి.  రీసెంట్ గా కూడా ఆమె మరో విజయాన్ని అందుకుంది. అలాంటి పూజ హెగ్డే, నిన్న రాత్రి జరిగిన 'వరుడు కావలెను' సినిమాకి సంబంధించిన సంగీత్ కి ముఖ్యఅతిథిగా హాజరైంది. ఈ నెల 29వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాను గురించి .. ఈ బ్యానర్ తో తనకి గల అనుబంధాన్ని గురించి మాట్లాడింది.

"ముందుగా ఈ సినిమా నిర్మాతలైన వంశీ - చినబాబు గార్లకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా పిలిచినందుకు. సాధారణంగా చీఫ్ గెస్టులుగా  హీరోలను మాత్రామే పిలుస్తారు. కానీ హీరోయిన్ ను పిలవడమనేది వాళ్ల మంచితనం .. అభిమానంగా నేను భావిస్తున్నాను. నన్ను గెస్టుగా పిలిచి ఎంతో రెస్పెక్ట్ గా చూశారు .. కానీ నేను ఎప్పుడూ వాళ్ల కుటుంబ సభ్యులలో ఒకరినే. సాధారణంగా వంశీ గారు నవ్వరు. ఈ స్టేజ్ పై ఆయన నవ్వుతుంటే చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తోంది.

హారిక అండ్ హాసిని బ్యానర్ పై నేను చేసిన సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  ఒక సినిమా కోసం వాళ్లు ఎంతగా కష్టపడతారనేది నాకు తెలుసు. ఈ సినిమాతో వాళ్లకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ .. అలాంటి వారిలో లక్ష్మీ సౌంజన్య ఒకరు. ఒక ఉమెన్ దర్శకత్వం చేయడమనేది అంత తేలికైన విషయమేం కాదు. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం ఫలించి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.

ఇక నాగశౌర్య విషయానికి వస్తే, చూడటానికి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు. అలా ఉండటం చాలా రేర్. ఎవరి సపోర్ట్  లేకుండా పైకి వచ్చిన సెల్ఫ్ మేడ్ ఆర్టిస్టులలో ఆయన ఒకరు. ఆయన హార్డు వర్క్ కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. రీతూ వర్మ స్దినిమాలోనే కాదు .. ఈ స్టేజ్ పై కూడా చాలా అందంగా ఉంది. తను చాలా హార్డ్ వర్కర్ అనీ .. మంచి పెర్ఫార్మ్ అని విన్నాను. ఆమెకి కావలసినంత సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలనీ .. అప్పుడు ఆ సక్సెస్ మీట్ కి కూడా చీఫ్ గెస్టుగా నన్నే పిలవాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.      
Tags:    
  • varudu kavalenu 
  • varudu kavalenu Release date 
  • varudu kavalenu Trailer 
  • Naga Shourya 
  • Ritu Varma 
  • Pooja Hegde 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS