తన ఇంట్లో కుక్ గురించి చెప్పిన పూజా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారారు పూజాహెగ్డే. ఒక హ్యాట్రిక్ కే కిందా మీదా పడిపోతుంటారు. కానీ.. డబుల్ హ్యాట్రిక్ విజయాల్ని తన ఖాతాలో వేసుకొని.. ఒకప్పుడు ఎవరైతే ఐరన్ లెగ్ అన్నారో.. ఇప్పుడు వారే గోల్డెన్ లెగ్ అని పొగిడించుకుంటున్న పూజా హెగ్డే.. ఏకకాలంలో ఆమె ఐదు సినిమాలు చేస్తున్నారు. మరో సినిమా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఆమె.. నిత్యం పని.. పని .. గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. తనను తాను పని రాక్షసిగా చెప్పుకునే పూజాహెగ్డే.. తాను ఓకే చెప్పే సినిమాల మీద పూర్తిస్తాయి జడ్జిమెంట్ ఆమెదే.
ఎవరెన్ని చెప్పినా.. సినిమా కథ నచ్చకున్నా.. అందులో తన పాత్ర తీరు బాగాలేకున్నా.. చేయటానికి ఇష్టపడరు. చాలామంది హీరోయిన్లకు భిన్నంగా ఆమె.. గ్లామర్ పీస్ గా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. ప్రతి సినిమాలో తన మార్క్ ఏదో ఒకటి ఉండేలా తపిస్తుంటారు.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన ఇంట్లోని కుక్ గురించి చెప్పుకొచ్చారు. సాధారణంగా హీరోయిన్లు.. హీరోలు తమ కుక్ గురించి పెద్దగా మాట్లాడరు. కానీ.. పూజా అందుకు భిన్నం. దాచుకోవాలని ఏమీ అనుకోరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇంతకీ తన కుక్ గురించి ఆమె ఏం చెప్పారంటే.. తన కుక్ ఒక తెలుగు అబ్బాయని.. అతను తెలుగు వంటల్ని చాలా బాగా చేస్తారని చెప్పింది.
తాను ప్యూర్ నాన్ వెజిటేరియన్ అని.. అయితే తెలుగు వంటకాల్లో వెజిటేరియన్ ఫుడ్ కూడా బాగుంటుందని చెప్పుకొచ్చింది. గోపికమ్మ పాట షూటింగ్ కోసం కోనసీమకు వెళ్లిన ఆమెకు తెలుగు ఫుడ్ పరిచయమైందని.. తాను పూతరేకుల్ని అమితంగా ఇష్టపడతానని చెప్పింది. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇస్టమని.. గోంగూర కర్రీ.. రొయ్యలు బాగుంటాయంటూ తనకు ఇష్టమైన ఫుడ్ తో పాటు.. తన కుక్ గురించి వెల్లడించింది.