చేతిలో కథలు లేకపోయినా అడ్వాన్సులతో జేబులు నిండుతున్నాయి..!
టాలీవుడ్ లో ఇప్పటికే సత్తా చాటుతున్న స్టార్ డైరెక్టర్స్ తో పాటుగా.. వారానికో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. కొత్త తరహా ఆలోచనలతో కథలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో హిట్ కొట్టిన దర్శకులు ఇండస్ట్రీలో నిలబడుతుంటే.. ప్లాప్ వచ్చిన వాళ్ళు మాత్రం రెండో ప్రాజెక్ట్ సెట్ చేసుకోడానికి నానాతంటాలు పడుతున్నారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే క్రేజ్ ఉంటుంది.. కాబట్టి నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేయడానికి ముందుకొస్తుంటారు. ఒక్క హిట్ కొడితే చాలు వెంటనే వాళ్ళకి అడ్వాన్సులు ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్ ఇచ్చిన దర్శకులందరూ ఆల్రెడీ నాలుగైదు ప్రాజెక్ట్స్ కి అడ్వాన్సులు తీసుకొని ఉన్నారు. స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోయినా ఇండస్ట్రీలో ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్సులు ఇవ్వడానికి యంగ్ ప్రొడ్యూసర్స్ రెడీ అవుతున్నారు. ఎందుకంటే హిట్ ఇచ్చిన దర్శకుడు ఉంటే స్టార్ హీరోల డేట్స్ దొరికాయి కాబట్టి ఏదీ ఆలోచించకుండా డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఇదే పద్ధతి నడుస్తోంది.
టాలీవుడ్ లో ఇంతకముందు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఒకటీ రెండు సినిమాలు మాత్రమే సెట్స్ పై ఉండేవి. కానీ ఇప్పుడు యువ నిర్మాతలు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఒక్కో ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వీరిలో సినిమా మీద ప్యాషన్ ఉన్న నిర్మాతలు కొందరైతే.. లాభాలు ఆర్జించాలని పెట్టుబడులు పెడుతున్నవారు మరికొందరు. రోజురోజుకూ పోటీ పెరుగుతుండంతో వీరందరూ సక్సెస్ లో ఉన్న దర్శకులకు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకుంటున్నారు.
వేణు శ్రీరామ్ లాంటి కొందరు తప్ప టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్ ఇచ్చిన దర్శకులందరూ పలు బ్యానర్స్ లో అడ్వాన్సులు తీసుకుని ఉన్నవాళ్లే ఉన్నారు. దీంతో చేతిలో కథలు లేకపోయినా దర్శకులకు అడ్వాన్సుల రూపంలో బాగానే వస్తున్నాయి. వీళ్ళందరూ మళ్ళీ హిట్ ఇస్తే నిర్మాత హ్యాపీయే. కానీ ప్లాప్ వస్తేనే కష్టనష్టాలు. అందుకే ఈ ప్రొడ్యూసర్స్ హిట్ ఇచ్చిన ప్రతి ఒక్క డైరెక్టర్ మీద కర్చీఫ్ వేసి పెట్టడం కంటే, సరైన దర్శకులతో ప్రాజెక్ట్ లు సెట్ చేసుకుంటే మంచిది.