ఫొటో టాక్‌ : ఈమె బ్యూటీ వయస్సు నిజంగానే 48

Update: 2020-04-05 00:30 GMT
లిసారాయ్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితం. ఈ అమ్మడు గత పాతిక సంవత్సరాలుగా హీరోయిన్‌ గా ప్రేక్షకులను అలరిస్తూనే ఈ అమ్మడు ఇప్పటికి కూడా సోషల్‌ మీడియా ద్వారా తన అందాల ప్రదర్శణ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. అయిదు పదుల వయసుకు దగ్గర పడ్డా కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. మూడు పదుల వయసు లేడీలాగే ఇంకా అదే పరువపు అందాలతో ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటోలో మేకప్‌ లేకుండా చాలా సింపుల్‌ గా ఉన్న లిసారాయ్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 48 ఏళ్ల వయసులో కూడా అదే బ్యూటీని ఈ అమ్మడు కంటిన్యూ చేయడం అంటే మామూలు విషయం కాదని ఈమె ఏ స్థాయిలో వర్కౌట్స్‌ చేస్తుందో, ఫిజిక్‌ విషయంలో ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటుందో కదా అంటూ నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు.

గత ఏడాది 99 సాంగ్స్‌ చిత్రం లో వచ్చిన ఈమె ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఈమె సినిమా అధికారికంగా కన్ఫర్మ్‌ అవ్వబోతుంది. వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లి తెరపై కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఇప్పటి వరకు పలు రియాల్టీ షోలకు కూడా ఈ అమ్మడు జడ్జ్‌గా హోస్ట్‌గా వ్యవహరించింది. అయిదు పదుల వయసు దాటినా కూడా ఈమె ఇలాగే ఉంటుందేమో.
Tags:    

Similar News