ఫోటో స్టోరి: MTV సుబ్బ‌ల‌క్ష్మిలా య‌మ జోరుమీదుందిరో!

Update: 2021-02-19 10:30 GMT
ఎర్రెర్ర‌ని ర‌వికె... జెరీ అంచు మోడ‌ల్.. ఎర్ర‌ని గాజులు.. బంగారు ప‌ట్టు ప‌రికిణీతో MTV  సుబ్బ‌ల‌క్ష్మిలా య‌మ జోరుమీద ఉంది.. ఎవ‌రీ అమ్మడు..? ప‌్ర‌త్యేకించి ఈ బ్యూటీ ఎవ‌రో ప‌రిచ‌యం చేయాలా? అస్స‌లు ఆ అవ‌స‌ర‌మే లేదు. హాటెస్ట్ గాళ్ స‌న్నీలియోన్ లేటెస్ట్ లుక్ ఇది. క‌రోనా క్రైసిస్ కాలంలో అత్త‌మామ‌లకు సేవ‌లు చేసేందుకు అమెరికా వెళ్లిన స‌న్నీలియోన్ తాను చెప్పిందే చేసి ప‌ర్ఫెక్ట్ ఇల్లాలు అనిపించుకుంది. అలాగే త‌న పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్యం రాకుండా జాగ్ర‌త్తగా చూసుకుని త‌ల్లి మ‌న‌సు చాటుకుంది.

ఇక సెల‌వుల‌కు కామా పెట్టి.. వ‌రుస‌ షూటింగ్ ల‌కు సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టిస్తూనే టీవీ కార్య‌క్ర‌మాల‌కు సంత‌కాలు చేస్తోంది. తాజాగా ఎమ్‌టివి స్ప్లిట్స్‌విల్లా -13 షూటింగ్ షెడ్యూల్ కోసం కేరళలో ఉంది. ``దేవుని సొంత దేశం`` నుండి ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి వెబ్ లో మంట‌లు పెడుతున్నాయి.

ప్ర‌ఖ్యాత‌ మిరాయ అల్మారా సాంప్రదాయ దుస్తుల్లో స‌న్నీ హీటెక్కించింది. రెడ్ హాట్ జాకెట్ ప‌రికిణీలో అదిరిపోయే లుక్ తో ఒక్క‌సారిగా గుబులు రేపింది ఈ బ్యూటీ. ఆ ప‌ట్టు అంచు వ‌స్త్రాల‌కు మ్యాచింగ్ బంగారు ఆభరణాల ఎంపిక ఆక‌ట్టుకుంది. హితేంద్ర కపోపారా త‌న లు‌క్ ను డిజైన్ చేశారు‌.

`పడవలో ప్ర‌యాణించే స‌న్నీ` ఇదీ కాన్సెప్ట్ షూట్. సన్నీ లియోన్ తన కేరళ డైరీస్‌ నుండి అద్భుతమైన ఫోటోలు వీడియో క్లిప్ లను  షేర్ చేయగా అవి వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. ఇంత‌కుముందు ఒక ఈత‌ కొలనులో సన్నీ చిల్లింగ్ ఫోటో ని షేర్ చేయ‌గా జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయ్యింది. స‌న్నీలియోన్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ వీర మాదేవి ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిందో అప్ డేట్ లేదు ఎందుక‌నో. బ్రేక్ ప‌డిన ఈ మూవీపైనా ఏదైనా అప్ డేట్ చెబుతుందేమో చూడాలి.
Tags:    

Similar News