వావ్ అంటూ ఆకాశానికి ఎత్తేసిన ఇమ్మిగ్రేష‌న్ ఆఫీస‌ర్!

`సినిమా విడుదలైన నాలుగైదేళ్ల తర్వాత అమెరికా నుండి తిరిగి వస్తుండగా ఒక ఆఫ్రికన్-అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ నన్ను చూడగానే కింగ్ భల్లాలదేవ అని గుర్తు పట్టడం ఆశ్చర్యమేసిందన్నారు.;

Update: 2026-04-04 02:45 GMT

`బాహుబ‌లి` రిలీజ్ అయి ద‌శాబ్దం పూర్త‌యినా? ఇప్ప‌టికీ ఆ సినిమాపై నిరంత‌రం టాలీవుడ్లో చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. మ‌రో ప‌దేళ్ల అయినా `బాహుబ‌లి` గురించి చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. `బాహుబ‌లి`ని కొట్టే సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కూ చర్చ అన్న‌ది నిత్య కృత్యం లాంటింది. `బాహుబ‌లి` పాత్ర‌కు ధీటుగా భ‌ల్లాల దేవ పాత్ర ఎంత గొప్ప‌గా పండిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రయాణంలో రానా ఎదుర్కొన్న కొన్ని అనుభ‌వాల‌ను గుర్తు చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ల‌ పాటు సాగిన ఈ ప్రయాణం కేవలం శారీరక కాకుండా మానసిక ఒత్తిడితో కూడుకున్నదన్నారు.

శారీరక, మానసిక ఒత్తిడి కలిగించిన నిర్దిష్ట సన్నివేశం ఏదని అడిగిన ప్రశ్నకు రానా ఎంతో పరిణతితో స్పందించారు. `ఇది ఏదో ఒక సీన్ గురించి కాదు. మొత్తం ఆరు ఏళ్ల ప్రయాణం అలాంటిదే. ఆ సమయంలో అసలు ఇలాంటి భారీ చిత్రాలను ఎలా తీయాలో? మేము కూడా తెలుసుకుంటు సాగాం. విజువల్ ఎఫెక్ట్స్ , వార్ సీక్వెన్స్‌ల విషయంలో సరికొత్త అందరూ పరిమితులను దాటి పని చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే పాత్ర కోసం తాను మారిన విధానం నేప‌థ్యంలో మ‌రో ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేసారు.`సినిమా విడుదలైన నాలుగైదేళ్ల తర్వాత అమెరికా నుండి తిరిగి వస్తుండగా ఒక ఆఫ్రికన్-అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ నన్ను చూడగానే కింగ్ భల్లాలదేవ అని గుర్తు పట్టడం ఆశ్చర్యమేసిందన్నారు.

ఈ సంఘటన ద్వారా సినిమా ఇచ్చే ఇంపాక్ట్ ఎంత కాలమైనా శాశ్వతంగా ఉంటుందనే విషయం మరోసారి అర్థమైందని సంతోషం వ్యక్తం చేశారు. పాన్ ఇండియాలో అంత గొప్ప పేరు సంపాదించిన రానా ఇప్పుడు న‌టుడిగా బిజీగా లేని సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా అనంత‌రం కొన్ని సినిమాల్లో హీరోగా, మ‌రికొన్ని చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌స్తుతం నిర్మాత‌గా బిజీగా ఉన్నారు. అక్క‌డా వైవిథ్య‌మైన కంటెంట్ నే నిర్మిస్తున్నారు. రెగ్య‌లర్ క‌మ‌ర్శియ‌ల్ స్టోరీల‌కు అంత‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు. అలా నిర్మాత‌గా రానా త‌న‌దైన ముద్ర వేసారు.

అయితే హీరోగా మాత్రం క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌ని తాను క‌మ‌ర్శియ‌ల్ స్టార్ గా మ‌లుచుకోవ‌డంలో ఫ‌లితాలు సానుకూలంగా లేక‌పోవ‌డంతో? క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల వైపు అడుగులు వేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇప్ప‌టికే కొన్ని క‌థ‌లు కూడా విన్నారు. కానీ వాటికి అంత‌గా క‌నెక్ట్ అవ్వ‌లేదు. ప్ర‌ముఖంగా న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయాల‌నే బ‌ల‌మైన ఆలోచ‌న‌తో ఉన్నారు. ఈ మ‌ధ్య కాలంలో కొత్త కుర్రాళ్లు సాధిస్తోన్న విజ‌యాలు ద‌గ్గ‌ర‌గా చూస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News