ఫోటో స్టోరి: శింబుతో బ్రేకప్ అయ్యాక..!
తమిళ క్రేజీ హీరో శింబు.. నయనతారకు బ్రేకప్ చెప్పేశాక హన్సికతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఓ దశలో వీరి ప్రేమాయణం కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వీరి లవ్‌స్టోరీ గురించి మాట్లాడని వారంటూ లేరు. త్వరలో పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా షికారు చేశాయి. ఇంతలోనే ఇద్దరి మధ్య అపార్థాలు అగాధాన్ని సృష్టించి విడదీశాయి.
శింబుతో ప్రేమలో వున్నంత కాలం హన్సికకు తమిళంలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాతే ఆమె కెరీర్ గాడి తప్పింది. స్టార్ హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీని ఏలుతుందనుకున్న హన్సిక కెరీర్ గాడితప్పింది. చిన్న చిన్న హీరోలతో సరిపెట్టుకుంటూ బండి నడిపించాల్సిన స్థితికి చేరింది. తమిళంలో హన్సిక చేతిలో వున్న ఒకే ఒక్క మూవీ `మహా`. ఇది ఓ థ్రిల్లర్.
దీనితో పాటు ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇది కూడా థ్రిల్లరే. 10 ఎపిసోడ్ లుగా స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ `నషా` అనే టైటిల్ తో రూపొందుతోంది. ఇటీవల ప్రియుడు శింబుతో పాత గొడవల్ని ప్యాచప్ చేసుకున్న హన్సిక మళ్లీ తన కెరీర్ గాడిలో పడాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు శింబు కూడా సహకరిస్తున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో శింబు హీరోయిన్ త్రిషని వివాహం చేసుకోబోతున్నడంటూ వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.