అక్క‌డ మాత్రం కుమ్మేస్తోన్న `పెద్ద‌న్న‌`

Update: 2021-11-26 00:30 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `పెద్ద‌న్న` తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. రొటీన్ కంటెంట్ తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో విమ‌ర్శ‌లు త‌ప్ప‌లేదు. టాలీవుడ్ ప‌రంగా సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాలేదు. దీంతో ఒక్క‌డ బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. అయితే కోలీవుడ్ లో మాత్రం `పెద్ద‌న్న` కుమ్మేస్తున్నాడు. మాతృక‌లో ఈ చిత్రం అన్న‌తై టైటిల్ తో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ ని మాత్రం షేక్ చేస్తోంది. ఒక్క త‌మిళ‌నాడులో నే 150 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని ట్రేడ్ నిపుణులు మ‌నోబాల విజ‌య‌బాల‌న్ ట్విట‌ర్ వేదిక‌గా తెలిపారు.

మొద‌టి వారం 119.53 కోట్లు.. రెండ‌వ వారం 22.52 కోట్లు..మూడ‌వ వారం మొద‌టి రోజు 1.29 కోట్లు..రెండ‌వ రోజు 1.47 కోట్లు..మూడ‌వ రోజు 1.83 కోట్లు.. నాల్గ‌వ రోజు2.60 కోట్లు.. ఐద‌వ రోజు 0.46 కోట్లు..ఆర‌వ రోజు 0.39 కోట్లు వ‌సూళ్ల‌తో మొత్తంగా 150 కోట్లు సాధించింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్  వ‌సూళ్లు చూసుకుంటే  239.21 కోట్లు సాధించింది. అంటే సినిమా పెద్ద స‌క్సెస్ అయిన‌ట్లే లెక్క‌. ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం కోలీవుడ్ లో మంచి వ‌సూళ్ల‌నే సాధించింది.

ఇంకా ర‌జనీకి  మార్కెట్ ఉన్న చాలా ఏరియాల్లో మంచి వ‌సూళ్ల‌నే సాధించింది. కొవిడ్ స‌మ‌యంలో ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను సాధించిందంటే ర‌జనీ మార్క్ వేసిన‌ట్లే క‌నిపిస్తోంది. మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా 1000 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ఇక శింబు న‌టించిన `మానాడు` చిత్రం రిలీజ్  అవ్వ‌డంతో కోలీవుడ్ లో `అన్నాతై` వ‌సూళ్ల పై ప్ర‌భావం ప‌డింది. వ‌సూళ్లు బాగా త‌గ్గాయి. `మానాడు` రిలీజ్ కి ముందు ఉన్నంత స్పీడ్ ఇప్పుడు క‌నిపించ‌లేదు. `అన్నాత్తై`కి సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News