అదేంటి 'పెద్దన్న' సైలెంట్‌ గా వచ్చేశావ్‌

Update: 2021-11-25 12:30 GMT
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా రూపొందిన తమిళ మూవీ అన్నాత్తే ఇటీవలే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ దర్శకత్వంలో వచ్చిన అన్నాత్తేకు తమిళనాట మంచి వసూళ్లు వచ్చాయి. కాని తెలుగు లో పెద్దన్నగా వచ్చి నిరాశ పర్చింది. తెలుగు ప్రేక్షకులు పెద్దన్న ను కనీసం పట్టించుకోలేదు. దాంతో వసూళ్లు మరీ దారుణంగా వచ్చాయి. కాని రజినీకాంత్ అభిమానులు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ లేదా శాటిలైట్ టెలికాస్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈమద్య కాలంలో సినిమాలన్నీ కేవలం మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అదే దారిలో అన్నాత్తే ను కూడా స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

నవంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ అయిన అన్నాత్తే సినిమాను డిసెంబర్‌ మొదటి వారంలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ కు గాను నెట్‌ ఫ్లిక్స్ వారు హక్కులు కొనుగోలు చేశారనే వార్తలు వచ్చాయి. కాని సైలెంట్‌ గా సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు కేవలం మూడు వారాల్లోనే రెడీ చేశారు. ఈమద్య కాలంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ ను కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. కాని అన్నాత్తే స్ట్రీమింగ్‌ విషయాన్ని కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పలేదు. ఇలా ఎందుకు చేశారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం అన్నాత్తే స్ట్రీమింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

బయ్యర్లు మరియు థియేటర్ల యాజమాన్యాల ఒత్తిడి ఉంటుందనే ఉద్దేశ్యంతో స్ట్రీమింగ్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి నాలుగు వారాలు అయిన తర్వాత సోషల్‌ మీడియాలో స్ట్రీమింగ్‌ విషయాన్ని ప్రకటిస్తారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అన్నాత్తే ను సైలెంట్‌ గా నెట్ ఫ్లిక్స్ మరియు సన్‌ నెక్ట్స్ లో స్ట్రీమింగ్‌ మొదలు పెట్టేశారు. థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేసేయవచ్చు. రజినీకాంత్‌ కు జోడీగా నయనతార నటించగా కీలక పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మీనా మరియు ఖుష్బులు ఈ సినిమాలో నటించారు.
Tags:    

Similar News