పాయల్ రూట్ మార్చాలి .. స్పీడ్ పెంచాలి!

Update: 2021-01-03 01:30 GMT
పాయల్ రాజ్ పుత్ .. స్విమ్మింగ్ పూల్ లో పెంచిన చేపపిల్లలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.  వెన్నెలను మాగాయలా నంజుకున్న జాబిలమ్మలా అనిపిస్తుంది. ఈ పిల్లను చూస్తుంటే .. 'అభినయం సంగతి దర్శక నిర్మాత లెరుగు .. అందం మాత్రం అభిమానులెరుగు' అనే సామెత నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గ్లామర్ కోసమే కుర్రాళ్లు థియేటర్ల చుట్టూ తిరుగుతుంటారు. అంతగా ఈ పొడుగు కాళ్ల సుందరి యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. మనసును గాడిపొయ్యిగా మార్చేసింది.

'ఆర్ ఎక్స్ 100' సినిమాలో ఈ అమ్మాయి చేసిన అందాల యుద్ధం చూసిన ప్రతి కుర్రాడు .. ఆ యుద్ధంలో తానుకూడా ఓ భాగమై పోవాలనుకున్నాడు. అంతగా వాళ్లలో ఆవేశాన్ని తెప్పించిన ఘనత ఈ సొగసు కళ్ల సుందరి సొంతం. ఈ సినిమాలో అమ్మడి రొమాన్స్ కి తట్టుకోలేని కుర్రాళ్లు కూల్ డ్రింక్స్ తాగేసి కూల్ అయ్యారు. ఇంటర్వెల్ లో అవి దొరక్కపోతే ఏమైపోయేవాళ్లో ఏమో! ఈ సినిమాతో ఈ 'కోక చుక్క' ఒక రేంజ్ లో దూసుకెళుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత చేసిన రెండు మూడు సినిమాల్లో పాత్రల ఎంపిక సరిగ్గా లేకపోవడం వలన వెనకబడింది.

పాయల్ సినిమాలు ప్లాప్ కావొచ్చుగానీ, గ్లామర్ పరంగా ఆమెకి ఎప్పుడూ తక్కువ మార్కులు పడలేదు. అచ్చమైన ఆవుపాలతో తయారుచేసినట్టుగా కనిపించే ఈ అందాల రాశికి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందువలన ఈ క్రేజ్ పడిపోకుండా చూసుకోవలసిన బాధ్యత ఆమెపైనే ఉంది. ఒక్కో మెట్టు ఎదగడానికి అవసరమైన కథలను ఎంచుకోవలసి ఉంటుంది. బీ గ్రేడ్ సినిమాలు కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవలసి ఉంటుంది. అవకాశం వస్తే అప్పుడు చూద్దాంలే అనుకోకుండా, స్పీడ్ పెంచవలసిన సమయం ఇది. అలా కెరియర్ పై కేర్ తీసుకుంటే పాయల్ కి ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మాటలను ఆమె పడుచు మనసు పట్టించుకుంటుందో లేదో! 
Tags:    

Similar News