• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇప్పుడు 'వీరమల్లు'కు...

ఇప్పుడు 'వీరమల్లు'కు డేట్స్ ఇస్తే.. 'భవదీయుడు'కు ఇంకెప్పుడు ఇస్తాడు..?

By - Tupaki Desk
Update: 2022-09-09 04:16 GMT
పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు జనసేన పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' తో కంబ్యాక్ ఇచ్చిన పవన్.. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ వచ్చారు. అయితే పవన్ రెండు పడవల మీద ప్రయాణం నిర్మాతలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.

'వకీల్ సాబ్' తర్వాత క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' మూవీని సెట్స్ మీదకు తీసుకొచ్చారు పవన్. ఇదే క్రమంలో హరీశ్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్'.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ఆమోదం తెలిపారు. అయితే పవన్ ప్రాధాన్యతా క్రమం మారడంతో మధ్యలో వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమాని ముందుగా పూర్తి చేశారు. ఇక పాండమిక్ రావడంతో ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి.

ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్‌మెంట్ల వల్ల.. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కు తగినన్ని డేట్స్ కేటాయించలేకపోతున్నారు. ఇది పవన్ కు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటి వరకు యాభై శాతం మాతృమే పూర్తయింది.

పోయిన ఏడాది పవన్ బర్త్ డేకి అనౌన్స్ చేసిన భవదీయుడు ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. సురేందర్ రెడ్డి సినిమా సంగతి అభిమానులు కూడా మర్చిపోయారు. ఈ నేపథ్యంలో 'వినోదయ సీతం' అనే తమిళ్ రీమేక్‌ సినిమాకి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నారు.

నిజానికి సాయిధరమ్ తేజ్‌ తో కలిసి పవన్ చేయాల్సిన రీమేక్ మూవీ ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. అయితే ముందుగా 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని పీకే భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు డేట్లు ఇస్తానని దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏఎమ్ రత్నంకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

జనసేన అధినేత అక్టోబర్ 5వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ బ్రేక్ దొరికినప్పుడు HHVM షూటింగ్ లో పాల్గొననున్నారని నివేదికలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాతే పవన్ మిగతా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాడని అంటున్నారు.

ప్రస్తుతానికి మైత్రీ మూవీ మేకర్స్ 'భవదీయుడు భగత్ సింగ్‌' పై పవన్ ఇంకా ఫైనల్ కాల్ తీసుకోలేదని టాక్. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా హరీష్ శంకర్ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ మాత్రమే కంప్లీట్ చేయగలడనిపిస్తోంది. కాకపోతే 20 రోజుల కాల్షీట్స్ కేటాయించగలిగే విరామం దొరికితే.. సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

పవన్ వచ్చే ఏడాది నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధం కావాల్సి ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో మహా అయితే రెండు సినిమాలు పూర్తి చేయగలడు. అదే జరిగితే 'భవదీయుడు భగత్ సింగ్' ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో పవన్ నిర్ణయాలు నిర్మాతలకు ఇబ్బంది లేకుండా ఉంటాయేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • PawanKalyan 
  • Janasena 
  • Actor 
  • HariHaraVeeraMallu 
  • Krish 
  • MythriMovieMakers 
  • BhavadiyuduBagathSingh 
  • Tollywood 
  • Dates 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS