ప‌వ‌న్ విశ్వ‌రూపం చూస్తారు..బీ రెడీ అంటోన్న నిర్మాత‌

Update: 2022-02-11 07:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. టాలీవుడ్ హంక్ రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన `భీమ్లా నాయ‌క్` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవ్వాల్సిన సినిమా థ‌ర్డ్ వవ్  కార‌ణంగా వాయిదా ప‌డ‌టంతో త‌దుప‌రి రిలీజ్ కి  రంగం సిద్దం అవుతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల తో సినిమాపై అంచ‌నాలు స్కైని ట‌చ్ చేస్తున్నాయి. ప‌వ‌న్ మార్క్ యాక్ష‌న్ స‌న్నివేశాలు పీక్స్ లో ఉండ‌బోతున్న‌య‌ని  టీజ‌ర్  తోనే తేలిపోయింది.

`లాలా భీమ్లా` యాక్ష‌న్ టీజ‌ర్ ఏ రేంజ్ లో అభిమానుల్లోకి వెళ్లిందో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్టైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత   సూర్య దేవ‌ర నాగ‌వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి `భీమ్లా నాయ‌క్` హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో క‌ళ్యాణ్   గారి వివ్వ‌రూపం చూస్తారు. అందులో నోడౌట్..అభిమానుల అంచ‌నాల్ని దాటి  సినిమా ఉంటుంద‌ని హింట్ ఇచ్చేసారు. సినిమాలో చాలా కొత్త కొత్త ఎలిమెంట్స్ చూస్తారు. సినిమా ప్లాట్ లైన్  ఈగో ఫ్యాక్ట‌ర్ అంతా  మాతృక‌కు వెర్ష‌న్ కి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది గానీ సినిమా ఫ్రెష్ ఫీల్ ని అందిస్తుంద‌న్నారు.

ఇక మ్యూజిక్ ప‌రంగా చెప్పాల్సిన ప‌నిలేద‌న్నారు. థ‌మ‌న్  కంటెంట్ త‌గ్గ కంపోజింగ్ అందించార‌న్నా``రు. ప‌వ‌న్-రానా మ‌ధ్య పోరాట స‌న్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని మాతృక వెర్ష‌ని బ‌ట్టి  తెలుస్తోంది.

మాతృక `అయ్య‌ప్పునం కోషియ‌మ్`  లో  ఈగో ఫ్యాక్ట‌ర్ బేస్ చేసుకునే  క‌థ మొత్తం న‌డుస్తుంది. బిజు మీన‌న్..పృథ్వీరాజ్ పాత్ర‌లు నువ్వా?  నేనా? అన్నంత‌గా సాగుతాయి. అదే కంటెంట్ ని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు  త్రివిక్ర‌మ్ స్ర్కిప్ట్ డిజైన్ చేసారు. ప‌వ‌న్ ని అతి ద‌గ్గ‌ర‌గా చూసింది త్రివిక్ర‌మ్ కావ‌డంతో ప‌వ‌న్ పాత్ర‌ని ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటార‌ని చెప్పొచ్చు. భీమ్లా నాయ‌క్ పాత్ర‌ని హైలైట్ గా డిజైన్ చేసిన‌ట్లు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హైలైట్ అవుతోంది.

మ‌రి ప‌వ‌న్ లో సిస‌లైన ఈగోయిస్ట్ ఎలా ఉంటాడో తెలియాలంటే  సినిమా రిలీజ్ వ‌ర‌కూ  ఆగాల్సిందే. ఇక రానా పాత్ర ఎంత మాత్రం త‌గ్గ‌దు. పోటా పోటీ పాత్ర‌లు కాబ‌ట్టి  స్ర్కిప్ట్ లో ఆయన పాత్ర‌కి స‌మ‌న్యాయం త‌ప్ప‌నిస‌రి. ఈ చిత్రాన్ని సితారా ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు.


Tags:    

Similar News