క్రిష్ ప్రాజెక్టు వెయిటింగ్.. హరీష్ శంకర్ సినిమా స్టార్ట్?

Update: 2020-06-04 14:01 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెల రోజుల పాటు షూట్ చేస్తే పెండింగ్ వర్క్ అంతా పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో పవన్ మరో సినిమాను కూడా ప్రారంభించారు. అయితే క్రిష్ ప్రాజెక్టు పీరియడ్ ఫిలిం కావడంతో.. భారీ సెట్లు.. ఎక్కువ మంది సిబ్బందితో షూట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ సినిమా విషయంలో పవన్ పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటుగా పవన్ కొన్ని నెలల క్రితం దర్శకుడు హరీష్ శంకర్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం హరీష్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. క్రిష్ భారీ ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం కష్టం కావడంతో ముందుగా హరీష్ సినిమా కొంత భాగం పూర్తి చేసి తర్వాత క్రిష్ ప్రాజెక్టు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నారట. ఎందుకంటే ఈ సినిమాకు భారీ సెట్లు అవసరం లేదు.. తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ జరిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయంపై పవన్ ఇద్దరు దర్శకులతో చర్చిస్తున్నారట.

ఒకవేళ హరీష్ కనుక స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఉంటే ముందుగా ఈ సినిమాను ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారట. అయితే దీనిపై తుదినిర్ణయం ఇంకా తీసుకోలేదని.. 'వకీల్ సాబ్' కంప్లీట్ అయ్యేలోపు దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News