పవర్ స్టార్ ఫస్ట్ మూవీకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా...?

Update: 2020-05-19 09:50 GMT
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించినా నటించకపోయినా ఏమాత్రం చరిష్మా తగ్గని నటుడు పవన్ కళ్యాణ్. పవన్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. పవన్ తొలి రోజు రికార్డులు అందుకోవడం ఇతర హీరోలకు అంత సులభం కాదు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ తనదైన మేనరిజం తో పవర్ స్టార్ గా మారిపోయాడు. 'తొలిప్రేమ' 'సుస్వాగతం' 'ఖుషీ' 'జల్సా' 'గబ్బర్ సింగ్' 'అత్తారింటికి దారేది' వంటి సినిమాలతో తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు రుచి చూపించాడు. కెరీర్లో ఇప్పటి వరకు 25 చిత్రాల్లో నటించిన పవర్ స్టార్ అటు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. 'జనసేన' పార్టీ స్థాపించి 2019 ఎలక్షన్స్ లో క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేసారు. కానీ ప్రజలు జనసేనని తిరస్కరించారు. దీంతో జనసేన అధినేత ఒక వైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడు. వరుస సినిమాలను ఓకే చేస్తూ కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ తో ఉన్నాడు. అలానే రెమ్యూనరేషన్ కూడా పెంచేసాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన జనాలు ఓల్డ్ విషయాలను బయటకి తీస్తున్నారు. ఈ నేపథ్యంలో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా రెమ్యూనరేషన్ గురించి పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన మొదటి సినిమాకి  అల్లు అరవింద్ నెలకి ఐదు వేల రూపాయలు ఇచ్చేవాడని.. సినిమా పూర్తయ్యే వరకు ఇలానే ఇచ్చుకుంటూ వచ్చాడని చెప్పుకొచ్చాడు. అంటే పవర్ స్టార్ తన మొదటి సినిమాకి నెలకి కేవలం 5 వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడన్నమాట. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే గీతా ఆర్ట్స్ అంటే మెగా ఫ్యామిలీ హోమ్ ప్రొడక్షన్ హౌస్ లాంటిదే. అందువల్లనే అల్లు అరవింద్ అలా పారితోషకం ఇచ్చి ఉంటాడు. అంతేకాకుండా అది పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హిందీ హిట్ సినిమా 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మించనున్నారు. ఆ తర్వాత తన కెరీర్లో 28వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.
Tags:    

Similar News