• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇదిగో... గెడ్డం గీసుకొన్న...

ఇదిగో... గెడ్డం గీసుకొన్న సింహం!

By - Tupaki Desk
Update: 2015-08-01 06:47 GMT
`నేనూ సింహం లాంటోడిని. అది గెడ్డం గీసుకోదు, నేను గీసుకొంటా. అంతే తేడా...` అంటూ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ `అత్తారింటికి దారేది`లో ఓ డైలాగ్ చెప్పాడు. ఆ  డైలాగ్ డెలివ‌రీ చూసి ప‌వ‌న్ నిజంగా సింహంలాంటోడే అన్నారు అభిమానులు. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ త‌న డైలాగ్‌ కి భిన్నంగా తాను కూడా  సింహంలాగే గెడ్డం గీసుకోకుండా వ‌దిలేశారు. దీంతో గుబురు గెడ్డంతో ఓ మ‌హ‌ర్షిని త‌ల‌పించారు ప‌వ‌న్‌. `గ‌బ్బ‌ర్‌ సింగ్‌` సీక్వెల్ మొద‌ల‌వుతున్నా త‌న గెడ్డం మాత్రం గీసుకోలేదు.

మ‌ళ్లీ మునుప‌టి స్మార్ట్ ప‌వ‌న్‌ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ వ‌చ్చారు అభిమానులు. వేరే స‌మయంలోనే అయ్యుంటే ప‌వ‌న్ `సినిమాకోస‌మే గెడ్డం పెంచాడు` అనుకొనే వాళ్లు. కానీ గ‌బ్బ‌ర్‌ సింగ్ సీక్వెలే చేయాల్సి ఉంది కాబ‌ట్టి, పోలీసు పాత్ర కోసం ప‌వ‌న్ మ‌ళ్లీ మునుప‌టిలా స్మార్ట్‌ గా క‌నిపించాల్సి వుంటుంద‌ని తెలుసుకొన్న అభిమానులు ఆయ‌న ఓల్డ్ లుక్ కోసం ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఆ ఎదురు చూపులు ఎట్ట‌కేల‌కు ఫ‌లించాయి. గ‌బ్బ‌ర్‌ సింగ్ సీక్వెల్ `స‌ర్దార్‌` ఇటీవ‌లే మొద‌లైంది. ఆ సెట్లోకి ప‌వ‌న్ గెడ్డం గీసేసి అడుగుపెట్టాడు. మునుప‌టికంటే ఇప్పుడు మ‌రింత స్మార్ట్‌ గా క‌నిపిస్తున్నాడు. సెట్లో ద‌ర్శ‌కుడు బాబి ప‌వ‌న్‌ తో క‌లిసి ఓ  ఫొటో తీయించుకొన్నాడు. అదే ఇది. ప‌వ‌న్ లుక్ అదిరిపోయింది కదూ! అన్న‌ట్టు అభిమానుల‌కోసం నిన్న‌నే ఓ స్టిల్ వ‌దిలాడు ప‌వ‌న్‌. ఈ నెల‌లో అన్న‌య్య చిరంజీవి బ‌ర్త్‌ డే ని పుర‌స్క‌రించుకొని `స‌ర్దార్‌` టీజ‌ర్ వ‌దిలే అవ‌కాశ‌ముంద‌ని సమాచారం.
Tags:    
  • Pawan kalyan 
  • Gabbar singh 2 movie 
  • Sardar Movie 
  • telugu NEws 

Similar News

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

Copyright @2026

Powered by Blink CMS