• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పింక్ లో పవన్ తెల్ల...

పింక్ లో పవన్ తెల్ల గడ్డంతో కనిపిస్తారా?

By - Tupaki Desk
Update: 2019-11-27 08:20 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం గురించి చాలారోజులుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి. 'పింక్' రీమేక్ లో పవన్ నటిస్తున్నారని ఇప్పటికే బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.  మరోవైపు బోనీ కపూర్ కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు.  ఈ సినిమాకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తాడని.. దిల్ రాజు-బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తారని అంటున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తారనే విషయంపై సినీవర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.   'పింక్' సినిమా అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ఒక లాయర్ పాత్ర.  ఆయన వయసుకు తగ్గట్టే తెలుపు గడ్డంతో కనిపించారు. 'పింక్' తమిళ రీమేక్  'నేర్కొండ పార్వై' లో అజిత్ కుమార్ కూడా తెలుపు రంగు జుట్టు.. గడ్డంలో సహజంగా కనిపించారు.  ఇప్పుడు పవన్ నటించబోయేది ఈ పాత్రలోనే.  దీంతో పవన్ కూడా ఇలానే డై వేసుకోకుండా సహజంగా తెలుపు రంగు గడ్డంతోనే కనిపిస్తారని అంటున్నారు. పవన్ స్క్రీన్ పై ఎంత స్టైలిష్ గా ఉన్నప్పటికీ  బయట మాత్రం సహజంగా ఉంటారు. ఒక్కోసారి హెయిర్ డై వేసుకోకుండానే ఉంటారు.  సినిమా స్టార్లలో ఇలా సహజంగా కనిపించే ధైర్యం అతి తక్కువ మందికే ఉంటుంది.  దీంతో 'పింక్' రీమేక్ లో సహజంగా  కనిపించేందుకు పవన్ కు అభ్యంతరం ఉండకపోవచ్చని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు కానీ అభిమానులు మాత్రం పవన్ సినిమాకోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు.  పవన్ చివరి సినిమా 2018 జనవరిలో రిలీజ్ అయిన 'అజ్ఞాతవాసి'.  రీ ఎంట్రీ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభించినా విడుదల కావడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది.  అంటే పవన్ వెండితెరకు రెండున్నరేళ్ళు దూరంగా ఉన్నట్టు లెక్క. మరి పవన్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.
Tags:    
  • Pawan kalyan 
  • Pink Movie Remake 
  • Pawan kalyan Look 
  • Pawan Look 
  • Pink Remake 
  • Telugu News 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS