గబ్బర్ సింగ్ సీన్ కాపీ చేశాడా?

Update: 2016-02-06 03:59 GMT
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ - చెన్నై బ్యూటీ సమంతా జంటగా నటించిన 'తెరి' అఫీషియల్ టీజర్ ను రిలీజ్ అయింది. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ మెస్మరైజింగ్ యాక్షన్ తో ఇరగదీసేశాడు. 'తెరి' టీజర్ లో ఫస్ట్ షాట్ నుంచి చివరి వరకూ ఫ్యాన్స్ కి - మాస్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే వర్డింగ్ ని ఇంత డిఫరెంట్ గా పలకించచ్చని ప్రూవ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్.

అయితే ఈ సన్నివేశాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో కంపేర్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. చుట్టూరా రౌడీలందరూ భయపడుతుంటే.. వాళ్లను కంట్రోల్ చేసే సన్నివేశం.. అచ్చం గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్ లాగానే ఉంది. సెట్ కూడా అలాగే ఉందన్నది పవన్ అభిమానుల వాదన కానీ.. పోలీస్ స్టేషన్ సెట్ సహజంగా అలాగే కనిపిస్తుందనే విషయం మర్చిపోకూడదు. కాని పవన్‌ అభిమానులు మాత్రం.. మా గబ్బర్‌ సీన్లే ఇక్కడ దొబ్బేశారు అంటూ సోషల్‌ సైట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మినహాయిస్తే.. 'తెరి' లో ఫైట్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం పిక్చరైజేషన్ విషయానికొస్తే.. ప్రతీ ఫ్రేమ్ నీ అధ్భుతంగా ఉందనే చెప్పాలి. స్టైలింగ్ విషయానికొస్తే.. విజయ్ ఎక్కువగా పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడు.. ఈసారి హెయిర్ స్టైల్ ని మాత్రం ఛేంజ్ చేసి కనిపిస్తున్నాడు. అయితే.. ఈ మూవీలో విజయ్ సరసన సమంతా - అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నా.. ఒక్కరికి కూడా టీజర్ లో ఒక ఫ్రేమ్ కూడా ఇవ్వకపోవడం ఆశ్యర్యం కలిగించే విషయమే.
Tags:    

Similar News