కాబోయే భర్త-తన పిల్లలు..రేణు ఏం చెప్పింది.?

Update: 2018-07-30 10:59 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడిపోయిన రేణుదేశాయ్ ఇన్నాళ్లు ఫుణెలో ఉండి పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఒంటరితనంతో కృంగిపోయిన రేణు ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ఆరంభిస్తోంది. ఈ సందర్భంగా రెండో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. ఇప్పటికే నిశ్చితార్థపు ఫొటోలను విడుదల చేసింది. ప్రస్తుతం తన కాబోయే భర్తతో కలిసి అమెరికాలో పర్యటిస్తోంది.

రేణుదేశాయ్ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. పిల్లలు అకీరానందన్ - ఆద్య తో పాటు కాబోయే భర్త తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ ట్రిప్ వెళ్లినా సోషల్ మీడియాలో తమ ఫొటోలను షేర్ చేయడం రేణుదేశాయ్ కు అలవాటు.. అప్పుడు క్యాప్షన్ పెడుతూ ‘ఏ ఫొటో బై అకీరా అనో లేక ఆద్య’ అనో పెట్టేవారు. కానీ ఈ సారి మాత్రం కొత్త క్యాప్షన్ ఇచ్చింది. అకీరా-ఆద్య-రేణు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి ‘మిస్టర్ ఫియాన్సే కొన్ని అద్భుతమైన క్షణాలను కెమెరాలో క్యాప్చర్ చేశారు’ అని  ట్విస్ట్ ఇచ్చింది.

ఇలా తన జీవితంలో భాగంగా కాబోయే భర్త మారిపోయాడని రేణు దేశాయ్ ఈ ఒక్క ఫొటోతో చాటి చెప్పిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అతడు పిల్లలతో సఖ్యతతో ఉంటున్నాడని చాటిచెప్పేందుకు ఈ ఫొటోకు ఆ క్యాప్షన్ ఇచ్చిందని  అభిప్రాయపడుతున్నారు. రెండో పెళ్లి చేసుకున్నా పిల్లలకు ఏం కాదని.. తనతోనే ఉంటారనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసిందంటున్నారు.
Tags:    

Similar News