సుప్రీమ్‌ కు పవన్‌ కిక్కిస్తాడట

Update: 2016-03-23 15:30 GMT
చిరంజీవి టైటిల్స్‌ అండ్ సాంగ్స్ తీసుకోవడంలో మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ దిట్ట అయిపోయాడు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక మెగాస్టార్‌ సాంగ్‌ ను రీమిక్స్‌ చేస్తున్న మేనల్లుడు.. తదుపరి సినిమాకు ఏకంగా మావయ్య టైటిల్‌ అయిన ''సుప్రీమ్‌''నే పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాలో అందం హిందోళం సాంగ్‌ ను రీమిక్స్‌ చేస్తున్నాడు కూడా.

ఇదంతా ఒకెత్తయితే.. అసలు ఈ సుప్రీమ్‌ సినిమాను ఏప్రియల్‌ రేసులో ఉంచాలనేది నిర్మాత దిల్ రాజు ప్లాన్. ఏప్రియల్‌ 8న సర్దార్‌.. ఏప్రియల్‌ 22న సరైనోడు సినిమా వస్తున్న తరుణంలో.. తన సుప్రీమ్‌ ను ఏప్రియల్‌ 29న విడుదల చేయాలని సాయిధరమ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ ఎప్పుడు చేయాలి? ఏప్రిల్‌ 10న చేస్తే బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చారట. మరి చీఫ్‌ గెస్టుగా ఎవర్ని పిలవాలి? ఆ మాట అనగానే మన సాయిధరమ్‌ చిన్న మావయ్య పవన్‌ కళ్యాణ్‌ ను రమ్మని రిక్వెస్టు చేయగా.. వెంటనే ఆయన ఎస్‌ అన్నారట.

మరి పవన్‌ నిజంగానే సుప్రీమ్‌ ఆడియో ఫంక్షన్‌ కు వచ్చి కిక్కిస్తాడా లేకపోతే ఈ వార్తలన్నీ రూమర్లగానే మిగిలిపోతాయో చూడాలి.
Tags:    

Similar News