రికార్డు కొట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Update: 2017-07-29 12:27 GMT
అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త రికార్డుని లిఖించాడు. శాటిలైట్ మార్కెట్లో ఇప్ప‌టిదాకా ఏ తెలుగు సినిమా అమ్ముడుపోనంత రేటుకి ప‌వ‌న్ సినిమా అమ్ముడుపోయింది. తెలుగు వెర్ష‌న్ 21 కోట్ల‌కు - హిందీ డ‌బ్బింగ్ రైట్స్ 11కోట్ల‌కు జెమినీ టీవీ సొంతం చేసుకుంది.  ఈ రేటు ఆల్‌టైమ్ రికార్డు అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. పవ‌న్ క‌ళ్యాణ్ - త్రివిక్ర‌మ్ క‌లిసి ముచ్చ‌ట‌గా మూడో సినిమా చేస్తున్నార‌న‌గానే అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. ఆ సినిమా కొత్త రికార్డులు లిఖించ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం జోస్యం చెప్పాయి. ఇప్పుడు అదే జ‌రిగింది.

శాటిలైట్ మార్కెట్లోనూ ఊహించ‌నంత డ‌బ్బుని రాబ‌ట్టింది. తెలుగు సినిమాకి సంబంంధించినంత వ‌ర‌కు 32 కోట్లు శాటిలైట్ రైట్లు ప‌లికిన మొట్ట మొద‌టి చిత్ర‌మిదే. ప‌వ‌న్‌ - త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఇదివ‌ర‌కు తెర‌కెక్కిన అత్తారింటికి దారేది ఇండ‌స్ట్రీ రికార్డుల్ని సృష్టించింది.  స‌గం సినిమా లీకైన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం ఆ క్రేజీగా విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. దాంతో ఆ క‌ల‌యిక‌లో రూపొందుతున్న మూడో చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా అమ్ముడుపోతుండ‌డం విశేషం. ఆయా ఏరియాల వైజ్‌గా కూడా భారీ ధ‌ర‌ల‌కి ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్టు తెలిసింది.
Tags:    

Similar News