పవన్ లుక్.. ఆ రోజు పక్కా

Update: 2017-08-15 09:08 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి ఇప్పటిదాకా ఏ విశేషమూ బయటికి రాలేదు. షూటింగ్ మొదలై ఆరు నెలలు కావస్తున్నా.. ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. లోగో రిలీజ్ చేయలేదు. ఫస్ట్ లుక్ లాంచ్ చేయలేదు. ఇంకే అప్ డేట్ కూడా లేదు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫ్రస్టేట్ అయిపోతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్ర టైటిల్ లోగో లాంచ్ చేస్తారంటూ కొన్ని రోజుల కిందట సమాచారం బయటికి రావడంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఐతే ఫస్ట్ లుక్ రెడీ అయినప్పటికీ కావాలనే ఈ రోజు లాంచ్ చేయలేదని సమాచారం.

ఇండిపెండెన్స్ డే కంటే కూడా పవన్ పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో త్రివిక్రమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఆ రోజే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి.. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేస్తారట. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. జల్సా.. అత్తారింటికి దారేది తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం. త్రివిక్రమ్ మిత్రుడు రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నాడు.
Tags:    

Similar News