పవన్.. హరీష్ మూవీ ఇంట్రెస్టింగ్ పుకారు
పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ ల కాంబోలో ఇప్పటికే గబ్బర్ సింగ్ వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. కొత్త సంవత్సరం సందర్బంగా పవన్ తో హరీష్ శంకర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. వకీల్ సాబ్ కు గుమ్మడి కాయ కొట్టేసిన పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే మూడ్ లో ఉన్నాడు. ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్ లు కూడా ఆయన చేసేందుకు సిద్దంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్ మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందనిపిస్తుంది. ఈ సినిమా గురించి మీడియా వర్గాల్లో ఆసక్తికర పుకారు ఒకటి షికారు చేస్తోంది.
గబ్బర్ సింగ్ లో పవన్ ను పోలీస్ గా చూపించి సూపర్ హిట్ కొట్టిన పవన్ ఈసారి ఐబీ ఆఫీసర్ గా హీరో పాత్రను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కథా చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ స్క్రిప్ట్ కు క్రిష్ కూడా తనవంతు సహకారం అందించారు. ప్రముఖ రచయితలు మరియు యంగ్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా కథ కోసం కూర్చున్నారు. దేశ భక్తి కలిగి ఉండే సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా హరీష్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం పూజా హెగ్డేను హీరోయిన్ గా సంప్రదించారనే వార్తలు కూడా వస్తున్నాయి. పూర్తి వివరాలు మరి కొన్ని వారాల్లోనే వచ్చే అవకాశం ఉంది.