పాన్ ఇండియా `శాకుంత‌లం` బిగ్ అప్ డేట్

Update: 2021-02-26 12:30 GMT
ఓ బేబి - మజిలీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించాక స‌మంత ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ పై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ కోసం సామ్ పాకులాడుతోంది. తెలుగు-హిందీ-త‌మిళం స‌హా అన్నిచోట్లా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి క్రేజు నెల‌కొన్న నేప‌థ్యంలో సీజ‌న్ 2 ఆఫ‌ర్ త‌న‌కు పెద్ద రేంజులో క‌లిసొచ్చేదే.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత గుణశేఖర్ తో పాన్ ఇండియా సినిమాకి సామ్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. పురాణేతిహాస క‌థాంశాన్ని ఎంచుకుని శాకుంత‌లం టైటిల్ తో ఈ సినిమాని గుణ తెర‌కెక్కిస్తున్నారు. ఇంత‌కుముందే మోష‌న్ టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది. గత రెండు నెలలుగా ఈ ప్ర‌య‌త్నం సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేసేందుకు భారీ బ‌డ్జెట్ల‌ను కేటాయించ‌నున్నార‌ని తెలిసింది.

తాజా స‌మాచారం ప్రకారం.. శాకుంతలం మొదటి షెడ్యూల్ మార్చి 15 నుండి ప్రారంభమవుతుంది. ఈ కీలకమైన షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో ఒక పెద్ద సెట్ ను వేస్తున్నారు. ఇందులో తెలుగ‌మ్మాయ్ ఈషా రెబ్బా.. మలయాళ హీరో దేవ్ మోహన్ కీలక పాత్రల కోసం ఎంపికయ్యారు.

మహాభారతం ఆది పర్వం నుండి పుట్టుకొచ్చిన‌ ప్రేమ క‌థా చిత్ర‌మిది. మహాకవి కాళిదాస్ ఐకానిక్ డ్రామా `అభిఘ్న‌ శకుంతలం` ఆధారంగా ఈ సినిమాని రూపొందించ‌నున్నారు. వీఎఫ్ ఎక్స్ స‌హా కంప్యూటర్ గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్య‌త ఉంది.




Tags:    

Similar News