షాకిస్తున్న ప్రభాస్ పారితోషికం.. లాభాల్లో వాటా!
స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలు కావాలని ఎందుకు భావిస్తున్నారు? అంటే ఇదిగో ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తోంది. స్టార్ హీరో వేరు పాన్ ఇండియా హీరో వేరు! అనేందుకు ఈ లెక్కలు పరిశీలిస్తే సరిపోతుందేమో! సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ .. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలు అప్పట్లో భారీ పారితోషికంతో పాటు వారి స్టార్ డమ్ రేంజుకు తగ్గట్టు లాభాల్లో వాటాలు అడిగేవారని విన్నాం.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ - మహేష్ లాంటి స్టార్లు ఈ కేటగిరీలో చేరారు. ఇప్పడు బాహుబలి స్టార్ ప్రభాస్ కూడా ఇదే బాటలో వెళుతున్నాడు. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత సాహో లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించాడు. ఈ సినిమా హిందీ బెల్టులో సంచలన విజయం సాధించడం ప్రభాస్ ఇమేజ్ ని ఉత్తరాదిన అమాంతం పెంచింది. అందుకే ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది.
ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాక ముందే తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 21 సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టుతో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కనుంది. ఈ మూవీని ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అందుకు తగ్గట్టే ప్రభాస్ పారితోషికం అందుకుంటున్నాడని సమాచారం. ఇంతకీ ప్రభాస్ పారితోషికం రేంజ్ ఎంత అంటే..?
డార్లింగ్ ప్రభాస్ కి ఏకంగా 70కోట్ల పారితోషికం అందనుందని సమాచారం. అదీ ఒక సంవత్సరంలో సినిమా పూర్తి చేయాలి. లేకపోతే పారితోషికం పెరుగుతుంది. పారితోషికంతో పాటు సౌత్ లాంగ్వేజ్ లో డబ్బింగ్ రైట్స్ లో 50 శాతం వాటా ఇవ్వాలి. ఇలా ఐతే ప్రభాస్ డేట్స్ ఇస్తాడు. లేదంటే లేదు. ప్రస్తుతం నాగ్ అశ్విన్- అశ్వని దత్ తో సినిమాకి ప్రభాస్ చార్జెస్ ఇలానే వేసాడట. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పడుకునే కి దాదాపుగా 18 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ అందనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.