• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాక్సాఫీసుపై త‌మిళ పులుల...

బాక్సాఫీసుపై త‌మిళ పులుల దాడి!

By - Tupaki Desk
Update: 2015-08-04 05:00 GMT
ఏక‌కాలంలో రెండు త‌మిళ్ పులులు తెలుగు బాక్సాఫీసుపై దాడి చేయ‌బోతున్నాయి. ఒకటి విజ‌య్ `పులి`, మ‌రొక‌టి విశాల్ `పాయుమ్ పులి`. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ స్థాయి ఇమేజ్‌ ని సొంతం చేసుకొన్న విజ‌య్ ఇప్పుడు `బాహుబ‌లి` త‌ర‌హాలో ఓ ఫాంట‌సీ చిత్రం చేస్తున్నాడు. అదే... `పులి`. వంద కోట్ల వ్య‌యంతో ఈ సినిమాని తెర‌కెక్కించార‌ట‌. బాహుబ‌లికి ఏమాత్రం త‌గ్గ‌కుండా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉంటాయ‌ట‌. ఇప్ప‌టికే `తుపాకి`తో తెలుగులో మంచి ఫామ్‌ ని అందుకొన్న విజ‌య్ `పులి`తో ఇక్క‌డ మ‌రింత‌గా అద‌ర‌గొట్టాల‌ని ఆయ‌న డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందుకే త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజు చిత్రాన్ని విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకొన్నాడు. మొన్న‌నే త‌మిళ్‌ లో ఆడియో ఫంక్ష‌న్‌జ‌రిగింది. తెలుగులో తుపాకి విడుద‌ల చేసిన శోభారాణియే `పులి`ని విడుద‌ల చేస్తోంది.  తెలుగులో 1400 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తామ‌ని ఆమె చెన్నైలో జ‌రిగిన ఆడియో వేడుక‌లో చెప్పింది. అంటే `బాహుబ‌లి` రేంజ్‌ లో విజ‌య్ `పులి` విడుద‌ల‌వుతుంద‌న్న‌మాట‌. వినాయ‌క చ‌వితిని పురస్క‌రించుకొని సెప్టెంబ‌రు 17న సినిమాని విడుద‌ల చేసే అవ‌కాశాలున్న‌ట్టు స‌మాచారం.

తెలుగులో ఇప్ప‌టికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ని సంపాదించిన విశాల్ కూడా త‌న సినిమాని అదే స‌మ‌యంలో విడుద‌ల చేయాల‌నుకొంటున్నాడు. విశాల్ త‌మిళంలో `పాయుమ్ పులి` అనే చిత్రం చేస్తున్నాడు. అది తెలుగులోనూ ఇప్ప‌టికే బిజినెస్ పూర్తి చేసుకొంది.  సెప్టెంబ‌రు 17నే సినిమాని విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో విశాల్‌, కాజ‌ల్ జంట‌గా న‌టించారు. విశాల్ ఓ క‌ర‌ప్టెడ్ పోలీసుగా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌లే చెన్నై లో పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఆ ట్రైల‌ర్ కూడా ఎక్స్‌ పెక్టేష‌న్స్ పెంచేలా ఉన్నాయి. రెండు పులులు ఒకేసారి తెలుగు బాక్సాఫీసుపై దాడి చేయ‌బోతున్నాయ‌న్న‌మాట‌. మ‌రి ఏ పులి ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.
Tags:    
  • paayum puli movie 
  • Puli movie 
  • Telugu NEws 

Similar News

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS