• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమెడియన్ తో సినిమా...

కమెడియన్ తో సినిమా తీయబోతున్న 'సూపర్ స్టార్' డైరెక్టర్...!

By - Tupaki Desk
Update: 2020-05-27 14:33 GMT
కోలీవుడ్ లో విభిన్నమైన విలక్షణమైన చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ పా.రంజిత్. 'అట్టకత్తి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పా.రంజిత్ తర్వాత కార్తీ హీరోగా రూపొందించిన 'మద్రాస్' సినిమాతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. సామాజిక అంశాలు.. దళితులు.. అణగారిన వర్గాలకు జరుగుతోన్న అన్యాయాలపై కమర్షియల్ అంశాలతో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నాడు పా రంజిత్. అలాంటి కథా వస్తువుతోనే తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ ను మెప్పించగలిగారు.. ఆయనతో వెంటవెంటనే రెండు సినిమాలు చేయగలిగారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కబాలి’ ‘కాలా’ సినిమాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ పేదలు.. అణగారిన వర్గాల ప్రజలు.. తనను నమ్ముకున్న వారి కోసం పోరాడే నాయకుడి పాత్రల్లో హీరో పాత్రధారి కనిపించారు. అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్‌ కు ఇష్టమైన డైరెక్టర్స్ లో ఒకడిగా పా. రంజిత్ నిలిచాడు.

అయితే రంజిత్ కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాడు. 'నీలం ప్రొడక్షన్స్' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి కథాబలం ఉన్న సినిమాలను తీస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఖాదిర్ - ఆనందీ హీరోహీరోయిన్లుగా 'పరియేరుమ్ పెరుమాళ్' సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఎన్నో అవార్డులతో పాటు రివార్డులను కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'గుండు' అనే సినిమా నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం తమిళ హీరో ఆర్యతో ఒక సినిమా చేస్తున్న పా.రంజిత్.. తన అసిస్టెంట్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా నిర్మించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించబోతున్నారట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యోగిబాబు ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. కేవలం అతన్ని దృష్టిలో పెట్టుకొనే క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తుంటారు దర్శకులు. 'కోకిల' అనే సినిమాలో నయనతారని లవ్ చేసే వ్యక్తిగా కనిపించి అలరించాడు. మరి ఇప్పుడు మరోసారి కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.
Tags:    
  • Pa Ranjith 
  • Movie 
  • Yogibabu 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS