#OTT గ్యాంబ్లింగ్.. టాలీవుడ్ కి అంత సీన్ లేదా?
మహమ్మారీ టెన్షన్లతో టాలీవుడ్ అతలాకుతలం అవుతుంటే సందట్లో సడేమియాలా రంగ ప్రవేశం చేసింది ఓటీటీ. కేవలం ఆ ఏడెనిమిది నెలల్లోనే నెమ్మదిగా గుత్తాధిపత్యం సాధించడంలో ఓటీటీ వేదిక పెద్ద సక్సెసైంది. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ సహా ఎన్నో వేదికల గురించి ప్రజల్లో అవగాహన అమాంతం పెరిగింది. వాటి వల్ల ప్రయోజనం కూడా అర్థమైంది. రెగ్యులర్ థియేట్రికల్ వీక్షణతో పోలిస్తే ఓటీటీ చవక అన్న భావన నెలకొంది.
ఇక ఓటీటీలకు మన అగ్ర నిర్మాతలు సైతం వత్తాసు పలకడంతో గేమ్ కాస్తా ఆసక్తికరంగా మారింది. తమ సినిమాల్ని ఓటీటీలకు అమ్మేసి లాభపడడంపై నిర్మాతలు దృష్టి సారిస్తున్నారు. ఇక అల్లు అరవింద్ లాంటి మాస్టర్ మైండ్ `ఆహా-తెలుగు` పేరుతో సొంత ఓటీటీనే రన్ చేస్తున్నారు.
ఇక నెట్ ఫ్లిక్స్ లాంటి కార్పొరెట్ దిగ్గజం నెమ్మదిగా టాలీవుడ్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇతర భాషల్లోలానే తెలుగులోనూ ఒరిజినల్ కంటెంట్ కోసం ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు తెలుగు కంటెంట్ కోసం డి-హౌస్ ని ప్రారంభించారని తెలుస్తోంది. కొత్త మీడియా హౌస్ లు ఇప్పుడున్న ప్రతిభావంతులు నెట్ ఫ్లిక్స్ -తెలుగు కోసం కంటెంట్ ను మార్చలేకపోతున్నారనే వాస్తవాన్ని అర్థం చేసుకున్న రానా దగ్గుబాటి.. సురేష్ ప్రొడక్షన్స్ లోనే డీ-హౌస్ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ .. అమెజాన్ ప్రైమ్ కోసం కంటెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల `దగ్గుబాటి ఫిల్మ్స్` పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం సరికొత్త ఆలోచనలు చేస్తూ.. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ లను రూపొందించడంలో ప్రత్యేకంగా పని చేస్తోంది. తెలుగు ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని కంటెంట్ ని రూపొందిస్తారు. అటుపై తమిళం.. హిందీలోకి దానిని అనువదిస్తారు.
బాలీవుడ్ .. తమిళంలో నెట్ ఫ్లిక్స్ సిరీస్ లు పెద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. కానీ తెలుగులోనే సరైన ఉత్పత్తి లేదన్న అభిప్రాయం ఉంది. అయితే దానిని మార్చాలన్నదే దగ్గుబాటి కాంపౌండ్ ప్రయత్నం అని తెలిసింది. ఇక యంగ్ హీరో రానా ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ విభాగంపై దృష్టి సారించారని ఇతర వ్యాపకాలు తగ్గించి సీరియస్ గా పని చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేష్ బాబు - రానా బృందం క్రియేటివ్ డిపార్ట్ మెంట్ కోసం ప్రత్యేకించి కొన్ని టీమ్ లను రెడీ చేసి పని చేయిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ కోసం ప్రత్యేకించి కసరత్తు చేస్తున్న ఈ బృందం అదిరిపోయే ప్రొడక్ట్ ని అందించే ప్రయత్నాల్లో ఉన్నారట.