అతడి పనైపోయిందన్న వారికి ఆస్కార్‌ తో సమాధానం

Update: 2020-02-11 00:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే ఆస్కార్‌ అవార్డు ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డు వేడుకల్లో పలువురు అవార్డులు సొంతం చేసుకున్నారు. కాని అందరి దృష్టి కూడా ఒక్కరిపై ఉంది. ఆయనే బ్రాడ్‌ పిట్‌. ఈయన వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌ చిత్రంలో అద్బుతమైన నటనను కనబర్చినందుకు గాను ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు.

పలువురు అవార్డులు సొంతం చేసుకున్నారు కదా ఈయన అవార్డును దక్కించుకోవడంలో ప్రత్యేకత ఏంటీ అంటూ మీరు అడగవచ్చు.. అసలు విషయం ఏంటీ అంటే ఈయన రెండు మూడు సంవత్సరాల క్రితం సినిమాలకు దూరం అవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌ లతో పాటు వైవాహిక జీవితం విచ్చిన్నం అవ్వడం.. ఆపై డ్రగ్స్‌ మరియు తాగుడుకు బాగా అలవాటు పడిపోవడం జరిగింది. ఆ సమయంలో అతడి కెరీర్‌ ఖతం అని.. అతడి పనైపోయిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఎంజెలీనా జోలీతో విడాకుల తర్వాత బ్రాడ్‌ పిట్‌ పరిస్థితి పూర్తిగా మారి పోయింది. అతడు లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు కేసుల పాలయ్యాడు. ఆ అవమానం తో బ్రాడ్‌ పిట్‌ డ్రగ్స్‌ కు బానిస అయ్యాడు. తాగుడు మరియు డ్రగ్స్‌ ను నియంత్రించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను అని... కాని వర్కౌట్‌ అవ్వడం లేదు అంటూ బ్రాడ్‌ పిట్‌ గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

తనను తాను మళ్లీ మార్చుకుని డ్రగ్స్‌ కు దూరం అయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ కొత్త జీవితానికి వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌ సినిమా మంచి అవకాశాన్ని తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో స్టంట్‌ మాస్టర్‌ గా కనిపించిన బ్రాడ్‌ పిట్‌ అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా హిట్‌ అవ్వడంతో పాటు ఇప్పుడు ఆస్కార్‌ దక్కడం తో అతడు తన పై విమర్శలు చేసిన వారికి ఇదే సమాధానం అన్నట్లుగా ఆస్కార్‌ ను చూపించాడు.
Tags:    

Similar News