'శశి' కోసం సిద్ శ్రీరామ్ పాడిన మ్యూజికల్ మెలోడీ 'ఒకే ఒక లోకం నువ్వే'..!

Update: 2021-01-04 05:44 GMT
యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ''శశి''. ఇందులో సురభి - రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.పి.వర్మ - సి.రామాంజనేయులు - చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రేమ కోసం పాటు పడే యువకుడిగా ఆది సాయి కుమార్ కనిపించాడు. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ నుంచి నిన్న ఆదివారం ఫస్ట్ సింగిల్ 'ఒకే ఒక లోకం నువ్వే' ని విడుదల చేశారు.

'శ‌శి' సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు అందించిన అద్భుతమైన ఈ మెలోడీ సాంగ్ ప్ర‌స్తుతం మ్యూజిక్ వ‌ర‌ల్డ్ లో వైర‌ల్ అవుతోంది. 'ఒకే ఒక లోకం నువ్వే.. లోకం లోనా అందం నువ్వే.. అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే' అంటూ సాగిన ఈ పాట‌ను సీనియర్ లిరిక్ రైట‌ర్ చంద్ర‌బోస్ రచించాడు. యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఈ పాటను తనదైన శైలిలో ఆలపించాడు. తన గాత్రంతో శ్రోతలను రంజింపజేసే సిధ్ శ్రీరామ్ మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ చేసాడని తెలుస్తోంది. దీనికి అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. మొత్తం మీద  'ఒక లోకం నువ్వే' సాంగ్ ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోనుందని చెప్పవచ్చు. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న 'శశి'.. ఈ మెలోడీ సాంగ్ తో అంచనాలు పెంచేశారు.Full View
Tags:    

Similar News