ఓ సైరా: కొత్తదనం కనిపించడం లేదే

Update: 2019-09-30 08:05 GMT
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా'.  సినిమా విడుదలకు కౌంట్ డౌన్ జస్ట్ రెండు రోజులే ఉంది.  ఈ సమయంలో 'సైరా' నుండి టైటిల్ సాంగ్ వీడియో 'ఓ సైరా' ను విడుదల చేశారు.

ఈ సినిమాకు బాణీలు అందించినవారు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా సునిధి చౌహాన్.. శ్రేయ ఘోశల్ పాడారు. 'పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవురా ఉయ్యాలవాడ నారసింహుడా' అంటూ నరసింహారెడ్డి వీరత్వం గురించి.. ఆయన గొప్ప లక్షణాల గురించి కీర్తిస్తూ సాగింది ఈ పాట సాహిత్యం. అమిత్ త్రివేది ట్యూన్ పవర్ఫుల్ గా ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పటికీ రొటీన్ గానే అనిపిస్తోంది.  ట్యూన్ లో కొత్తదనం అయితే లేదు. ఇక ఈ పాటను ఎక్కువ భాగం పాడింది సునిధి. ఆమె వాయిస్ ఈ పాటకు పెద్దగా సూట్ కాలేదనిపిస్తోంది.  శ్రేయ ఘోశల్ పాడిన బిట్ వారకూ బాగానే ఉంది.

విజువల్స్ లో ఇక ఈ పాటకు సంబధించినవే కాకుండా ఇంపాక్ట్ కోసం యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించినవి కూడా జోడించారు. మరి ఈ పాట బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.  ఏదేమైనా ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు బాణీలు అందించడం మాత్రం కత్తిమీద సామే అని చెప్పాలి.


Full View

Tags:    

Similar News