50 ఏళ్ల సంక్రాంతి సంబరాలు.. అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా..
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడులో కూడా ఈ పొంగల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.;
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడులో కూడా ఈ పొంగల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద మొదలుకొని ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇకపోతే మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ఈ అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లుగా ఎన్నో లెజెండరీ కథలకు, మధుర జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రభావితం చేసిన అక్కినేని కుటుంబం సినీ ప్రముఖులతో కలిసి ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అర్ధ శతాబ్దపు సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజానికి హైదరాబాదులో స్థాపించబడిన ఈ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రతి యేటా సంక్రాంతి వేడుకలను స్టూడియో ఉద్యోగులతో కలసి జరుపుకోవడం అక్కినేని వారసత్వంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఈ కొత్త సంక్రాంతి కొత్తజంట నాగచైతన్య , శోభిత ధూళిపాల జంటతో సందడి మొదలైంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో ఘనంగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాలలో.. అనంతరం శోభిత, నాగచైతన్య జంట తో పాటూ అమల స్వయంగా దగ్గరుండి మరీ ఉద్యోగులకు భోజనాలు వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఏది ఏమైనా సెలబ్రిటీలు అయినప్పటికీ తమవద్ద పనిచేసే కార్మికులతో, ఉద్యోగులతో కలిసిపోయి వారిని ఒక ఫ్యామిలీగా చూసుకుంటూ గడపడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక భోజనాల అనంతరం అక్కడి వారితో ఫోటోలు దిగారు. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలలో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల అలాగే అమలా తల్లి , నాగచైతన్య, శోభిత, సుమంత్, సుప్రియ యార్లగడ్డ ఇలా తదితరులు సందడి చేశారు. అనంతరం అక్కడి ఉద్యోగులతో కలిసి ఫోటోలు కూడా దిగారు.
నాగచైతన్య విషయానికి వస్తే తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న ఈయన.. ప్రస్తుతం వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే శోభిత విషయానికి వస్తే.. ఈమె కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో వేట్టువం అనే మూవీలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈమె ఫస్ట్ లుక్ ని కూడా ఇటీవల మేకర్స్ సంక్రాంతి స్పెషల్ గా పంచుకున్నారు.