ఎన్టీఆర్.. అను వద్దు.. అని వద్దు

Update: 2018-01-17 14:30 GMT
 అజ్ఞాతవాసి మూవీ అందరికంటే ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇమేజ్ నే డ్యామేజ్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్ నుంచి అనేక మార్లు డిజప్పాయింట్ మూవీస్ వచ్చాయి. కానీ వాటిలో ఫ్యాన్స్ ను అలరించే సన్నివేశాలకు లోటు ఉండదు. కానీ అజ్ఞాతవాసి ఆ మాత్రం కూడా అలరించలేదు. అందుకే త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తున్నారు ప్రేక్షకులు. ఇది త్రివిక్రమ్ తర్వాతి చిత్రాలపై కూడా ఎఫెక్ట్ చూపుతోంది.

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ ఇప్పటికే ప్రకటన మాత్రమే కాదు.. లాంఛింగ్ కూడా జరిగిపోయింది. పైగా త్రివిక్రమ్ అంటే ఎన్టీఆర్ కి మక్కువ ఎక్కువ. అందుకే ఈ ప్రాజెక్టు యథాతథంగా ఉంటుందని చెబుతున్నాడట. అయితే.. ఈ మూవీ విషయంలో కేర్ తీసుకోవాలంటూ అభిమానులు చెబుతున్న మాటలు ఆలోచింపచేస్తున్నాయట. మాటల మాంత్రికుడితో సినిమా చేయవద్దని ఎవరూ చెప్పడం లేదు కానీ.. కీలకమైన టెక్నికల్ టీం ఎంపికలో మాత్రం ఎలర్ట్ గా ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ ను ఏ మాత్రం ఎంకరేజ్ చేయవద్దని అంటున్నారట. మరోవైపు హీరోయిన్ అను ఇమాన్యుయేల్ విషయలో కూడా మరోసారి ఆలోచించాలని చెబుతున్నారట. అను వద్దు.. అనిరుధ్ వద్దు బాబోయ్ అంటున్నారట నందమూరి అభిమానులు. ఇప్పటికే ఇందుకు ఎన్టీఆర్ దాదాపుగా ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News