ఎన్టీవోడు.. మొదలెడితే ఆగడట!

Update: 2015-06-24 06:09 GMT
దాదాపు మూడు నెలలుగా చెప్పుకుంటున్నాం. ఇదిగో ఆ తేదీన ఎన్టీఆర్‌, సుకుమార్‌ల సినిమా మొదలైపోతోందని. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉందా ప్రాజెక్టు. ముందేమో స్క్రిప్టు పక్కాగా రెడీ కాలేదన్నారు. ఆ తర్వాత లొకేషన్లు ఫైనలైజ్‌ చేయడంలో లేటవుతోందన్నారు. వీసా సమస్యల వల్లే డిలే అన్న ప్రచారం కూడా జరిగింది. ఐతే ఇప్పటిదాకా ఏం జరిగినా కానీ.. జులైలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా మొదలవడం ఖాయమని.. యూకే షెడ్యూల్‌కు సంబంధించి సన్నాహాలు పూర్తయ్యాయని.. యూనిట్‌ సభ్యులు రెడీగా ఉన్నారని చెబుతున్నారు.

ఇప్పటిదాకా జరిగిన డిలే పర్ఫెక్షన్‌లో భాగంగానే అని.. షూటింగ్‌కు సంబంధించి పక్కా ప్లానింగ్‌తో ఉన్న సుకుమార్‌.. తన కెరీర్లో ఎన్నడూ లేనంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. జులైలో మొదలయ్యే షెడ్యూల్‌.. ఏకధాటిగా సెప్టెంబరు వరకు సుదీర్ఘంగా సాగుతుందని సమాచారం. దీంతో సినిమా 50 శాతానికి పైగా అక్కడే పూర్తయిపోతుందని.. ఆ తర్వాత ఇండియాకు వచ్చి మిగతా షూటింగ్‌ ఇంకో షెడ్యూల్‌లో అవగొట్టేస్తారని సమాచారం. ముందుగా అనుకున్నట్లే సంక్రాంతి రేసులో సినిమాను నిలపాలన్నది ప్లాన్‌ అట. కాబట్టి నందమూరి అభిమానులు నిరాశ చెందాల్సిన పని లేదన్నమాటే.

Tags:    

Similar News