ఫ్లాప్ లకు బాధపడ్డా కుంగిపోను -ఎన్టీఆర్

Update: 2017-01-24 17:42 GMT
ఎన్టీఆర్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న స్టార్ హీరో. కమర్షియల్ సినిమాలతో స్టార్ గా ఎదిగి.. ఆ తర్వాత వాటితోటే విపరీతమైన ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అ తర్వాత యంగ్ టైగర్ తన కెరీర్ ను మలుచుకున్న తీరు అద్భుతం అని చెప్పాలి.

టెంపర్ మూవీ నుంచి స్టార్ట్ చేసి. విభిన్నమైన సినిమాలతో సూపర్ హిట్స్.. బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తున్నాడు. అయితే.. కెరీర్ లో ఫ్లాప్స్ ఎవరికైనా తప్పవంటున్నాడు ఎన్టీఆర్. ఎంతో కష్టంతో.. ఇష్టంతో చేసిన సినిమాలు కూడా ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంటాయని.. అలాంటి అనుభవం ఎదురైనా.. వాటినే తలుచుకుంటూ కూర్చునే మెంటాలిటీ తనది కాందటున్నాడు యంగ్ టైగర్. ఫ్లాప్స్ వచ్చినంత మాత్రాన కుంగిపోనని చెప్పాడు ఎన్టీఆర్.

'నేను సినిమా ఫ్లాప్ అయినపుడు నేను బాధపడతాను. అయితే.. దాన్నే ఆలోచించుకుంటూ నిద్రపాడు చేసుకోవడం లాంటివి చేయనుం. వీలైనంత త్వరగా దాన్ని మర్చిపోయి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ను మరింత బాగా చేసేందుకు ట్రై చేస్తాను' అని చెప్పాడు జూనియర్. ఇప్పటివరకూ కమర్షియల్ మూవీస్ కి ప్రాధాన్యత ఇచ్చినా.. ఫ్యూచర్ లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ కే ఇంపార్టెన్స్ ఇస్తాడట ఎన్టీఆర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News