రివెంజ్ డ్రామాలో గడ్డం ఎపిసోడ్స్
ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో గుబురు గడ్డం, ఏపుగా పెరిగిన మీసంతో కనిపిస్తున్నాడు. ఎక్కడకు వెళ్లినా ఇదే గెటప్. మరీ ఇంతగా గెడ్డాలు, మీసాలు పెంచుకుని తిరగాల్సిన అవసరమేంటో? అని జనాలంతా ఆరాలు తీయడాలు మొదలెట్టారు. అయినా ఎవరికీ ఏదీ తెలియలేదు. అసలెందుకిలా చేస్తున్నాడు? అన్న సందిగ్ధం అభిమానుల్లోనూ ఉంది. అయితే ఆ సీక్రెట్ ఏంటో ఇప్పటికి రివీలైంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న తెలిసిందే. 'మా నాన్నకు ప్రేమతో' ఓ రివెంజ్ డ్రామా. కథ ప్రకారం ఈ గెటప్ అవసరం. ముందుగా గడ్డంతో సన్నివేశాల్ని తెరకెక్కించడానికి సుక్కూ ప్లాన్ చేశాడు. అందుకే జూనియర్ ఇలా పెంచుకుని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పటికే వీసా సమస్యల వల్ల వాయిదా పద్ధతిలో సెట్స్‌కెళ్లడం ఆలస్యమైంది. దరిమిలా ఆ గడ్డం, మీసంలో గుబురు మరింతగా పెరిగింది. ఎట్టకేలకు జూలై తొలివారంలో రెగ్యులర్ షూటింగ్‌కి వెళుతున్నారు. ఎన్టీఆర్, సుక్కూ సహా టీమ్ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ చిత్రంలో రకూల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. బివిఎస్‌ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదీ సంగతి.